Medak Crime News: అమ్మాయిలు దొరక్క పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్నారు. అమ్మాయి ఉందని తెలిస్తేచాలు అబ్బాయి తరపు కుటుంబసభ్యులు వచ్చేస్తున్నారు. కానీ ఓ మహిళ తన మూడో పెళ్లి కోసం అడ్డుగా ఉన్న నాలుగు నెలల కూతుర్ని చంపాలని ప్లాన్ చేసింది. అందుకు మనస్సు అంగీకరించలేదు. చివరకు చిన్నారిని మంజీరా నదిలో పడేసింది. సంచలనం రేపిన ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలంలో సంచలనం రేపిన నాలుగు నెలల ఆడ శిశువు మిస్టరీ ఎట్టకేలకు వీడింది.ఈ కేసులో తొలి నుంచి అనుమానిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆపై రిమాండ్‌కు తరలించారు. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్లొద్దాం.
అసలేం జరిగింది?
పోలీసుల వివరాల మేరకు టోప్య తండాకు చెందిన గాయత్రి- నర్సాపూర్ మండలం ఆద్మాపూర్ తండాకు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెద్దలు దగ్గరుండి పెళ్లి చేశారు. దగ్గరుండి చేయాల్సిన లాంచనాలన్నీ పూర్తి చేశారు. కొన్ని నెలల తర్వాత భార్యభార్తల మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో భార్యభర్తలు విడివిడిగా ఉంటున్నారు.
పెళ్లయిన కూతుర్ని ఇంట్లో ఉంచడం బాగాలేదని భావించారు ఆమె తల్లిదండ్రులు. చివరకు కొల్చారం మండలం సీతారాం తండాకు చెందిన మరొక వ్యక్తితో రెండో పెళ్లి దగ్గరుండి జరిపించారు. ఈ జంటకు నాలుగు నెలల కిందట బేబీ ఉంది. మొదట్లో బాగానే జరిగింది. పెళ్లయిన ఏడాదికి పాప పుట్టింది. తొలుత పాపను చూసి తెగ మురిసిపోయింది ఆ తల్లి.
ALSO READ: ఒక్క రూపాయి కోసం హత్య.. కస్టమర్ ని చంపిన షాపు ఓనర్
చివరకు ఏమైందో తెలీదు. భార్య భర్తల మధ్య విభేదాలు పొడచూపాయి. ఈ క్రమంలో భర్త నుంచి విడాకులు తీసుకుంటే బాగుంటుందని ప్లాన్ చేసింది. దీనివల్ల సంపాదన తనకు కొంతైనా వస్తుందని భావించింది. ఆ తర్వాత ముచ్చటగా మూడో పెళ్లి చేసుకోవచ్చని ఆలోచన చేసింది. మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది.
మూడో పెళ్లికి ప్లాన్
భర్తతో విడాకులు తీసుకోవాలంటే బేబీ అడ్డంగా ఉందని భావించింది. ఈమెని చంపేస్తే ఎలాంటి సమస్య ఉండదని భావించింది. తండ్రి, వరుసకు అత్తతో మాస్టర్ ప్లాన్ వేసింది. చిన్నారిని చంపితే భర్తకు అనుమానం వస్తుందని, నదిలో విసిరేస్తే ఎలాంటి జాడ తెలియదని, మనం తప్పించుకోవడం సులువు అవుతుందని ప్లాన్ చేశారు.
చివరకు చిట్కుల్ చాముండేశ్వరి ఆలయం సమీపంలోని మంజీరా నదిలోకి నాలుగు నెలల బేబీని విసిరేసింది కన్నతల్లి. కనీసం చెప్పాల్సిన తండ్రి సైతం ఈ విషయంలో కూతురికి సహకరించాడు. ఇంతవరకు కథ, స్క్రీన్ ప్లే వీళ్లు అనుకున్నట్లుగానే సాగింది. ఎందుకోగానీ బేబి కనిపించలేదన్న బాధ తల్లిలో కనిపించలేదు. తల్లి వ్యవహారశైలి గమనించిన ఆమె భర్త, కొల్చారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గాయత్రిపై పోలీసుల ఫోకస్
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటన తర్వాత గాయత్రి ఎస్కేప్ అయ్యింది. చివరకు ఆమె ఆచూకీ లభించింది. కానీ నాలుగు నెలల బేబీ ఏమైంది తెలియలేదు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఎట్టకేలకు మిస్టరీని ఛేదించారు.
గాయత్రి ఫ్యామిలీపై పోలీసులు దృష్టిపెట్టారు. గాయత్రి కదలికలపై ఫోకస్ చేశారు. ఆ తర్వాత తీసుకుని విచారించగా అసలు విషయాలు బయటపెట్టేసింది. ఆమెతోపాటు తండ్రి, వరసకు అత్తయిన మహిళను అరెస్టు చేశారు పోలీసులు. న్యాయస్థానం.. ముగ్గురికి 14రోజుల రిమాండ్ విధించింది. కూతురుకు వంత పాడిన తండ్రి సైతం జైలు పాలయ్యాడు.