BigTV English

Chiyaan 65: విక్రమ్ కొత్త మూవీ.. అన్నీ సెట్ అయితే త్వరలోనే సెట్స్ పైకి!

Chiyaan 65: విక్రమ్ కొత్త మూవీ.. అన్నీ సెట్ అయితే త్వరలోనే సెట్స్ పైకి!

Chiyaan 65: కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా చాలా మంది యంగ్ టాలెంట్ ఎంట్రీ ఇస్తున్నారు. మొదటి సినిమాతోనే చాలామందిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఫిలిం ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయితే చాలు తర్వాత పెద్ద హీరో పిలిచి మరి అవకాశాలు ఇచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి.


అలానే తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో పార్కింగ్ అనే సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ కుమార్ బాలకృష్ణన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఓటిటిలో చూసిన తర్వాత చాలామంది ఈ సినిమాను ప్రశంసించడం మొదలుపెట్టారు. ఇది ఒక బ్లాక్ కామెడీ థ్రిల్లర్ ఫిలిం. ఈ సినిమా హిట్ అయింది కాబట్టి రామ్ కుమార్ బాలకృష్ణన్ కు ఈరోజు చియాన్ విక్రమ్ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

కొత్త మూవీ ఫిక్స్


చియాన్ విక్రమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నన్ను నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ రూపంలో విడుదలయ్యాయి. అన్నిటిని మించి శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. అలానే శివపుత్రుడు సినిమాతో కూడా తెలుగులో మంచి పేరు విక్రమ్ కి వచ్చింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమా కూడా మంచి పేరు తీసుకొచ్చింది. తన కెరీర్ లో మొత్తం 64 సినిమాలు పూర్తి చేసుకున్న విక్రమ్. ప్రస్తుతం 65వ సినిమాని రామ్ కుమార్ బాలకృష్ణన్ తో చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించిన అధికారికి ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

సక్సెస్ ట్రాక్ 

షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన దర్శకుడు ఎస్ యు అరుణ్ కుమార్. విజయ్ సేతుపతి హీరోగా వరుస సినిమాలు చేసిన అరుణ్ కుమార్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. రీసెంట్ గా విక్రమ్ వీర ధీర సూరన్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి అరుణ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే పార్ట్ 2 ఈ సినిమాకి వచ్చింది. దీనికి ఫ్రీక్వల్ గా మరో కథ రానుంది. బహుశా ఆ సినిమా పూర్తి అయిన తర్వాత రామ్ కుమార్ తో విక్రమ్ సినిమా చేసే అవకాశం ఉంది. అయితే విక్రం చేసిన ధ్రువ నక్షత్రం సినిమా కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

Also Read: Rajinikanth: వచ్చి 50 ఏళ్ళు అయింది, క్రేజ్ చెక్కుచెదరలేదు

Related News

Anupama Parameswaran: ప్లీజ్‌ నా సినిమా చూడండి.. ప్రెస్‌మీట్‌లో ఏడ్చేసిన హీరోయిన్‌ అనుపమ

Coolie Vs War2 : రేపటి మొదటి ఆట టాక్ తో అసలు కథ స్టార్ట్ అవ్వబోతుంది 

Coolie: నాగార్జున కూలీ ఒప్పుకోవడం వెనక ఎంత పెద్ద కథ జరిగిందో?

Coolie: కూలీ మూవీ కోసం ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

Tollywood: నిర్మాతలతో ఫెడరేషన్‌ భేటీ.. మళ్లీ విఫలమైన చర్చలు.. సమ్మె కొనసాగింపు తప్పదా?

Big Stories

×