BigTV English

Tollywood: నిర్మాతలతో ఫెడరేషన్‌ భేటీ.. మళ్లీ విఫలమైన చర్చలు.. సమ్మె కొనసాగింపు తప్పదా?

Tollywood: నిర్మాతలతో ఫెడరేషన్‌ భేటీ.. మళ్లీ విఫలమైన చర్చలు.. సమ్మె కొనసాగింపు తప్పదా?


Tollywood Cine Workers Strike: నేటితో సినీ కార్మికుల సమ్మె కొలిక్కి వస్తుందని అంతా అనుకున్నారు. ఫెడరేషన్సభ్యులు, ఇతర సినిమా సంఘాలు నాయకులు బుధవారం(ఆగష్టు 13) మరోసారి నిర్మాతలతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు తెలుగు ఫిలిం ఛాంబర్ఆఫ్కామర్స్కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఫేడరేషన్సభ్యులు, నిర్మాతలు, ఫిల్మ్ఛాంబర్సభ్యులతో పాటు తెలంగాణ ఫిల్మ్డెవలప్మ్మెంట్కార్పొరేషన్ఛైర్మన్‌, నిర్మాత దిల్రాజు పాల్గొన్నారు.

వాడి వేడిగా కొనసాగుతున్న చర్చలు


అయితే సమావేశం కూడా విఫలమైనట్టు తెలుస్తోంది. నిర్మాతలు ప్రతిపాదించిన వర్కింగ్ కండిషన్స్ కి ఒక్క దానికి కూడా ఫెడరేషన్సభ్యులు, నేతలు అంగీకరించడం లేదు. దీంతో ఛాంబర్లో ఇరు వర్గాల మధ్య చర్చలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. దాదాపు రెండున్నర గంటలకు పైగా సమావేశం కొనసాగుతూనే ఉందికానీ, ఇప్పటికీ సమ్మెపై కొలిక్కి వచ్చే అంశం ఒకటి కూడా రాలేదుదీంతో సమావేశం కూడా విఫలమైన సమ్మె కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా ఫెడరేషన్సభ్యుల కోరిక పమేరకు నిర్మాతల మరోసారి చర్చలకు సిద్దమైన సంగతి తెలిసిందే. వారి పిలుపు మేరకు ఇవాళ ఫిల్మ్ఛాంబర్లో భేటీ నిర్వహిస్తు ఇటీవల ప్రకటన ఇచ్చారు.

మరోసారి కూడా నిరాశే

ఇరువురు కూడా సమ్మె సమస్య పరిష్కరించుకునే దిశగా చర్చలు జరిపి.. వివాదాన్ని కొలిక్కి తీసుకువస్తారని అంతా అభిప్రాయపడ్డారు. కానీ, ఫెడరేషన్మొండివైఖరి చూపిస్తూ.. నిర్మాతల ప్రతిపాదనలకు తొసిపుచ్చుతున్నారు. దీంతో నిర్మాతల ఫెడరేషన్డిమాండ్స్తీర్చలేమని, సమ్మె కొనసాగింపు తాము సిద్ధమే అని స్టేట్మేంట్ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో సినీ కార్మికులు సమ్మె కొనసాగేలా కనిపిస్తోంది. మరి వివాదం ఎప్పుడు సద్దుమనుగుతుంది, సమ్మెకు ఎండ్కార్డు పడేది ఎప్పుడో స్పష్టత రావడం లేదుకాగా 30 శాతం వేతనాలు పెంపుకోసం ఫెడరేషన్ సభ్యులు, యూనియన్నాయకులు నిర్మాతలను డిమాండ్చేశారు. దీనికి ప్రొడ్యూసర్స్ఒప్పకోకపోడవడంతో ఫెడరేషన్సమ్మెకు పిలుపునిచ్చింది.

Also Read: Actress Sadha: సుప్రీం తీర్పు.. ప్లీజ్ అలా చేయొద్దంటూ బోరుమని ఏడ్చేసిన హీరోయిన్ సదా

ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రకటన లేకుండానే రాత్రి రాత్రే సమ్మెకు సైరన్మోగించాయి. దీంతో మిడియం, చిన్న సినిమాల షూటింగ్స్నిలిచిపోయాయి. ఫెడరేషన్సభ్యుల తీరుపై నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కార్మికులు వేతనాలు ఎక్కువగా ఉన్నాయని పెంచడం కుదరదని వివరించారు. అంతేకాదు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ నష్టాల్లో ఉందని, టైంలో వేతనాలు పెంపు సాధ్యపడదని కూడా చెప్పాయి. అయినా ఫెడరేషన్వినకుండ మొండిగా వ్యవహరిస్తూ కార్మికులతో సమ్మెకు పిలుపునిచ్చింది. మరోవైపు నిర్మాతలు కూడా తగ్గేదే లే అంటున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తెప్పించనుకుని షూటింగ్స్జరుపుతామని తెలిపాయి. దీంతో సినీ కార్మికులు గొడవలు, దాడులకు దిగుతూ టాలీవుడ్లో ఉద్రిక్తత పరిస్థితులు తీసుకువస్తున్నారు.

Related News

Anupama Parameswaran: ప్లీజ్‌ నా సినిమా చూడండి.. ప్రెస్‌మీట్‌లో ఏడ్చేసిన హీరోయిన్‌ అనుపమ

Coolie Vs War2 : రేపటి మొదటి ఆట టాక్ తో అసలు కథ స్టార్ట్ అవ్వబోతుంది 

Coolie: నాగార్జున కూలీ ఒప్పుకోవడం వెనక ఎంత పెద్ద కథ జరిగిందో?

Coolie: కూలీ మూవీ కోసం ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

Chiyaan 65: విక్రమ్ కొత్త మూవీ.. అన్నీ సెట్ అయితే త్వరలోనే సెట్స్ పైకి!

Big Stories

×