Actress Jessie Cave : ‘హ్యారీ పాటర్ అండ్ ది హాఫ్ బ్లడ్ ప్రిన్స్’ (Harry Potter And The Half Blood Prince) మూవీలో లావెండర్ బ్రౌన్ అనే పాత్ర పోషించిన నటి జెస్సీ కేవ్ (Jessie Cave) తాజాగా తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. అప్పుల నుంచి బయట పడడానికి ఆమె ఈ అ*డల్ట్ సైట్లో చేరినట్టు వెల్లడించింది. మరి ఆమె ఈ సైట్లో ఏం చేస్తుంది? అనే వివరాల్లోకి వెళ్తే…
స్వయంగా ప్రకటించిన నటి
‘హ్యారీ పాటర్ అండ్ ది హాఫ్-బ్లడ్ ప్రిన్స్’లో రాన్ వీస్లీ స్నేహితురాలు లావెండర్ బ్రౌన్ హ్యారీ పాటర్ అభిమానులు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ పాత్ర పోషించిన నటి పేరు జెస్సీ కేవ్. తాజాగా ఈ అమ్మడు అ*డల్ట్ కంటెంట్ ప్లాట్‌ఫామ్ అయిన ఓన్లీ ఫ్యాన్స్‌లో చేరారు. తన సొంత పాడ్‌కాస్ట్ ‘బిఫోర్ వుయ్ బ్రేక్ అప్’లో కనిపించిన జెస్సి ‘ఓన్లీఫ్యాన్స్’లో చేరినట్లు స్వయంగా ఒప్పుకుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆమె కంటెంట్ మాత్రం అడల్ట్స్ కోసమే అన్నట్టుగా ఉండదని స్పష్టం చేసింది. “ఓన్లీఫ్యాన్స్” అనేది పెద్దల కంటెంట్ కు ప్రసిద్ధి చెందినప్పటికీ, తన పోస్ట్ లు లైంగికంగా ఉండవని జెస్సీ స్పష్టం చేసింది. “ఇది ఒక ఫెటిష్. ఫెటిష్ అంటే ఖచ్చితంగా లైంగికంగా ఉండదు” అని ఆమె వివరించింది.
ఆమె ఓన్లీఫ్యాన్స్‌లో చేరాలనే తన నిర్ణయం గురించి సోషల్ మీడియా పోస్ట్ లో “నేను ఒక సంవత్సరం ప్రయత్నిస్తాను. నా టార్గెట్ ఏంటి ? ఇంటిని సురక్షితంగా ఉంచడం, ఆర్సెనిక్/లీడ్ వాల్‌పేపర్‌ను కప్పడం, కొత్త పైకప్పు నిర్మించడం మొదలైనవి. అప్పుల నుండి బయటపడటం, నన్ను నేను శక్తివంతం చేసుకోవడమా? గతంలో నన్ను తప్పుగా అంచనా వేసిన వారికి నిరూపించడమా ? నేను ఇంతకు ముందు ఎప్పుడూ పెట్టుబడి పెట్టని దానిలో సమయం కేటాయించడం… సెల్ఫ్ లవ్” అని రాసింది.
వీకెండ్ లో జెస్సీ కేవ్ తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లలో సబ్‌స్క్రిప్షన్ ఆధారిత అడల్ట్ కంటెంట్‌కు పాపులర్ అయిన ప్లాట్‌ఫామ్ ఓన్లీఫ్యాన్స్‌లో చేరబోతున్నట్లు వెల్లడించింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో సబ్‌స్క్రైబర్‌లకు బెస్ట్ క్వాలిటీ గల హెయిర్ సౌండ్స్, ఇంద్రియాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అందిస్తున్నట్లు చెప్పింది. ఓన్లీఫ్యాన్స్ లైంగిక కంటెంట్‌కు ప్రసిద్ధి చెందినప్పటికీ, క్రియేటర్స్ ఇతర అంశాలను కూడా పోస్ట్ చేయవచ్చు.
7000 మందిని దాటుకుని ‘హ్యారీ పోటర్’ ఛాన్స్
బ్రిటిష్ నటి జెస్సీ కేవ్ లండన్‌లోని కింగ్‌స్టన్ విశ్వవిద్యాలయంలో ఇల్లుస్ట్రేషన్, యానిమేషన్ ను పూర్తి చేసింది. నటనను కొనసాగించాలని నిర్ణయించుకునే ముందు వివిధ థియేటర్లలో ఆమె వేదిక వెనుక పని చేసింది. కేవ్ RADAలో స్టేజ్ మేనేజ్‌మెంట్‌ను అభ్యసించింది. కానీ తరువాత డ్రామా స్కూల్‌కు దరఖాస్తు చేసుకుంది. ‘హ్యారీ పాటర్’లో పాత్ర లభించినప్పుడు ఆమె ది ఆక్స్‌ఫర్డ్ స్కూల్ ఆఫ్ డ్రామాకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ‘హ్యారీ పాటర్ అండ్ ది హాఫ్-బ్లడ్ ప్రిన్స్’లో లావెండర్ బ్రౌన్ పాత్ర కోసం జెస్సీ 7000 మందికి పైగా అమ్మాయిలతో పోటీ పడింది. చివరకు అంత మందిని వెనక్కి నెట్టి, ఆ రోల్ కొట్టేసింది. ఆమె చివరి రెండు ‘హ్యారీ పోటర్’ చిత్రాలలో తన పాత్రను కంటిన్యూ చేసింది. అప్పటి నుండి, జెస్సీ అనేక బ్రిటిష్ టీవీ షోలలో చిన్న చిన్న పాత్రలు చేసింది.