Blasting in Crackers Factory: అనకాపల్లి ఏజెన్సీలోని బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ఐదుగురు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మృతులు సామర్లకోట వాసులుగా గుర్తించారు. పేలుడు ధాటికి షెడ్డు కూలిపోయింది. మృతదేహాల భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇంకా పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 20 మందికి పైగా బాణా సంచా తయారీ కేంద్రంలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లా కైలాస మండల సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో.. ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అప్రమత్తమైన అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది.
ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో, గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించి ఘటనకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.
అనకాపల్లి ఏజెన్సీలోని బాణసంచా కర్మాగారంలో.. అగ్నిప్రమాదం సంభవించడం ఇది తొలిసారి కాదు. ఇటీవల కూడా పేలుడు సంభవించాయి. ఇలా తరుచూ ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. వీటిలో కనీసం ఏడు గోడౌన్లు, బాణాసంచా తయారీ షెడ్లు కూలిపోయాయి. అయితే ఒక్కసారిగే పేళుల్లు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Also Read: పెట్రోల్ పంప్ మేనేజర్ హత్య.. బాటిల్‌లో పెట్రోల్ పోయలేదని తుపాకీతో..
ఈ బాణ సంచా కేంద్రానికి అనుమతులు ఉన్నాయా లేదా అని ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే ఇది ఒక మారుమూల ప్రాంతం. దీన్ని పర్యవేక్షణ చేయ్యడానికి కూడా ఎవరు ఉండరు. తరుచూ ఈ బాణ సంచా కేంద్రాన్ని నిర్వహిస్తుంది ఎవరు..? అందులో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి డేటా వంటివి కలెక్ట్ చేయాల్సి ఉంది. కానీ అధికార యంత్రాంగం ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. ఇప్పటికీ ఈ బాణ సంచా కేంద్రానికి సంభందించి యజమాని ఎక్కడున్నారో తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇక ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి అనితతో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. బాధితుల ప్రస్తుత పరిస్థితి తెలుసుకున్నారు. బాధితులంతా కాకినాడ జిల్లా సామర్లకోట వాసులుగా గుర్తించారు పోలీసులు.
ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సహాయక చర్యలు మరింత వేగవంతం చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు.
మృతులు వివరాలు.. సతాతబాబు 50, గోవింద 45, రామలక్ష్మి 38, నిర్మల 36, పురం పాపా 40, బాబు 40, బాబురావు 56, మనోహర్,