Shukra Margi 2025: శుక్రుడు ఈ రోజు అంటే ఏప్రిల్ 13, 2025న తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. శుక్రుడి ప్రత్యక్ష సంచారం అనేక రాశుల వారికి ప్రయోజనాలను అందిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని ఆనందం, సంపద ,శ్రేయస్సుకు కారకుడిగా చెబుతారు. శుక్రుడు తన ఉచ్ఛ రాశి అయిన మీన రాశిలో నేరుగా సంచరిస్తే.. 12 రాశుల వారిపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. కానీ మూడు రాశుల వారు దీని నుండి భారీ ప్రయోజనాలను పొందుతారు. ఈ శుక్రుడి రాశి మార్పు వ్యక్తికి సంపద, శ్రేయస్సును ప్రసాదిస్తుంది.
జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో లేకపోతే.. అది కూడా కొన్ని ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. 2025 ఏప్రిల్ 13 నుండి శుక్రుడు ప్రత్యక్ష సంచారంలోకి వెళ్లినప్పుడు ఎవరికి శుభ ప్రయోజనాలు లభిస్తాయో, ఎవరు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
శుక్రుని ప్రత్యక్ష సంచారం మేష రాశి వారికి అద్భుత ఫలితాలను అందిస్తుంది. గృహ సంబంధిత ఖర్చులు కొంత పెరుగుతాయి. మిమ్మల్ని మీ పనిని కొత్త దిశలో తీసుకెళ్లే అవకాశం మీకు లభిస్తుంది. శుక్రుడి సంచారం వల్ల మీ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. అంతే కాకుండా మీ వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది.
వృషభ రాశి:
శుక్రుడి ప్రత్యక్ష సంచారం వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో.. మీ జీవితంలో సంపద , శ్రేయస్సు పెరుగుతాయి. అంతే కాకుండా మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ పనిలో విజయం సాధిస్తారు. మీకు స్నేహితులు, సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. ఇది మీ వృత్తి పరమైన, వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది. ఈ సమయం మీకు కావలసిన ఫలితాలను ఇస్తుంది.
మిథున రాశి:
శుక్రుని ప్రత్యక్ష సంచారం ముఖ్యంగా మీ ఉద్యోగం, పని రంగంలో సహాయ కరంగా ఉంటుంది. గా గ్లామర్, మీడియా, ఫ్యాషన్ రంగాలకు చెందిన వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. మీ వృత్తి పరమైన ప్రయాణం విజయవంతమవుతుంది. అందం లేదా ఫ్యాషన్‌తో సంబంధం కలిగి ఉన్న రంగాలలో మంచి ఫలితాలను చూస్తారు. మీ ప్రేమ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. సహోద్యోగులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు.
కర్కాటక రాశి:
శుక్రుడి సంచారం వల్ల మీకు మంచి రోజులు వస్తాయి. ఈ సమయంలో మీరు పనిచేసే చోట పురోగతి లభిస్తుంది. భూమి, భవనం, వాహనానికి సంబంధించిన విషయాలలో విజయం సాధించే అవకాశం ఉంది. మీ జీవితంలో మతపరమైన కార్యకలాపాలు, ప్రయాణాలకు కూడా సమయం ఉంటుంది. మీకు కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. ఇది మీ ధైర్యాన్ని పెంచుతుంది.
Also Read: హనుమంతుడి గురించి.. ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే !
సింహ రాశి:
ఈ రాశి వారికి.. శుక్రుడి ప్రత్యక్ష కదలిక కొంచెం సవాలుగా ఉంటుంది. కానీ దీని తరువాత మంచి ఫలితాలను కూడా పొందుతారు. ఈ సమయంలో.. మీరు వ్యాపారం లేదా ఉద్యోగంలో ప్రయాణ సంబంధిత పనిలో విజయం పొందుతారు. అంతే కాకుండా ఊహించని ఆర్థిక లాభాలు పెరుగుతాయి. గతంలోని ఇబ్బందులకు మీరు పరిష్కారాలను కనుగొంటారు. మీ ఆనందం రెట్టింపు అవుతుంది.
కన్య రాశి:
శుక్రుడి ప్రత్యక్ష సంచారం.. మీ వైవాహిక జీవితం పై ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా ఈ సమయంలో మీ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. వ్యాపారంలో భాగస్వామ్యం ప్రయోజనకరంగా ఉంటుంది.