Petrol pump Murder| మనుషుల్లో రాను రాను సహనం నశిస్తోంది. చిన్న కారణాలకే ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. ఆ ఉద్రేకంలో ఎదుటివారి ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా జరిగిన ఒక ఘటనలో ఒక వ్యక్తి బైక్ పై పెట్రోల్ పంప్ కు వచ్చాడు. అక్కడ తనకు ప్లాస్టిక బాటిల్ లో పోయాలని అడిగాడు. కానీ సిబ్బంది నిరాకరించడంతో గొడవ చేశాడు. చివరకు కోపంలో తన వద్ద ఉన్న తుపాకీ తీసుకొని కాల్చేశాడు. ఆ క్షణికావేశంలో ఒక నిండు ప్రాణాలు బలిగొన్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్ షహర్ పట్టణంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బులంద్ షషర్ పట్టణంలోని ఒక బిజీ ప్రాంతంలో ఉన్న పెట్రోల్ పంప్ కు గత బుధవారం రాత్రి ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చాడు. అక్కడ ఆ సమయంలో డ్యూటీలో ఉన్న పెట్రోల్ పంప్ సిబ్బంది రాజు శర్మ అతడిని పలకరించగా.. ఆ బైకర్ తనకు ప్లాస్టిక్ బాటిల్ లో పెట్రోల్ పోయాలని అడిగాడు. కానీ నిబంధనల ప్రకారం.. అలా బాటిల్ లో పెట్రోల్ పోయకూడదు. అందుకే సిబ్బంది రాజు శర్మ్ తనకు అలా చేయడానికి అనుమతులు లేవని.. బాటిల్ లో పెట్రోల్ పోయడం కుదరదని చెప్పాడు.
Also Read: స్కూల్ బ్యాగుల్లో కత్తులు, కండోమ్ లు, మారణాయుధాలు..
ఆ బైకర్ తనకు చాలా అత్యవసరంగా కావాలని అడిగాడు. అయినా ఆ సిబ్బంది అందుకు అంగీకరించలేదు. దీంతో ఆ బైకర్ కోపంతో వాగ్వాదానికి దిగాడు. అతడిని శాంతింపజేయడానికి సిబ్బంది రాజు శర్మ ప్రస్తుతం పెట్రోల్ పంప్ మేనేజర్ లోపల్ ఉన్నారని.. వారు అనుమతిస్తే పెట్రోల్ అలాగే పోస్తానని అన్నాడు. దీంతో రాజు శర్మతో కలిసి పెట్రలో పంప్ లోనికి వెళ్లగా అక్కడ మేనేజర్ తో విషయం చెప్పాడు. కానీ మేనేజర్ కూడా అలా చేయడం ప్రమాదకరమని.. నిబంధనల ప్రకారం అలా చేయడం నేరమని చెప్పాడు.
అయితే బైకర్ మాత్రం తనకు అర్జెంట్ అని చెబుతూ మేనేజర్ లో ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ వారు అంగీకరించలేదు. దీంతో సహనం నశించిన ఆ బైకర్ తన వద్ద ఉన్న తుపాకీ తీసి బెదిరించాడు. వెంటనే పెట్రోల్ పోయమని అడిగాడు. అది చూసి ఆ మేనేజర్ అతని చేతిలో ఉన్న తుపాకీని లాగేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ బైకర్ బ్లైండ్ గా కాల్పులు జరిపాడు. ఆ తోపులాటలో పెట్రోల్ పంప్ మేనేజర్ కు బులెట్లు తగిలాయి. దీంతో ఆ బైకర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తరువాత వెంటనే పెట్రోల్ పంప్ సిబ్బంది మేనేజర్ ని తీసుకొని ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పెట్రోల్ పంప్ మేనేజర చనిపోయాడు.
ఈ ఘటనలో స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. ఆ బైకర్ ఆచూకీ తెలుసుకునేందుకు సిసీటీవి వీడియోలను పరిశీలిస్తున్నారు. వీడియోల ద్వారా అతని ముఖం కనిపిస్తోందని.. త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.