Political Murder: సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. రాజకీయ కక్ష నేపద్యంలో బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు అనే వక్తిని కత్తులతో దారుణంగా నరికిచంపారు. దీంతో ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రత్యర్ధుల దాడిలో మరనించిన వ్యక్తి గతంలో సర్పంచ్ గా పనిచేశారు.
సూర్యపేట జిల్లా యర్కారం గ్రామంలో ఈ సంఘటర జరిగింది. పాత రాజకీయ కక్షల కారణంగానే ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. గ్రామంలో హత్య చేసిన అనంతరం మృతదేహన్ని గ్రామ శివారులో విసిరివేసి పరారైనట్లు సమాచారం. మృదేహన్ని పోలీసులు స్వాదీనం చేసుకొని సూర్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో కొనసాగుతున్న పాత రాజకీయ కక్ష విభేదాలే ఈ హత్యకు కారణం ఉండవచ్చని అక్కడ స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం!
అయితే కొంత కాలంగా గ్రామంలో రాజీకయ ఆదిపత్య పోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మధు హత్యకు గురికావడం అనేక అనుమానాలు దారి తీస్తుంది. ఇదే గ్రామంలో 2020 సంత్సరంలో సర్పంచ్ ఓంటెద్దు వెంకన్న కూడా దారుణ హత్యకు గురయ్యారు. ఇప్పుడు ఇదే గ్రామంలో మరో రాజకీయ నాయకుని హత్య చేడంతో ఎర్కారం గ్రామంలో తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఇలా వరుస రాజకీయ హత్యలతో గ్రామంలో శాంతి భద్రతులు క్షీనిస్తున్నాయని స్ధానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు గ్రామంలో బందో బస్తు ఏర్పాటు చేసి పరిస్ధతిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటనకు సంభందించిన వ్యక్తులను వెంటనే పట్టుకొని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంభ సభ్యులు కోరుతున్నారు.
హత్యకు గురైన చింతలపాటి మధు మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ హాస్పిటల్ లో పరిశీలించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ IPS
మృతుడి భార్యతో మాట్లాడిన జిల్లా ఎస్పీ
దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ https://t.co/4ReuRHYWdS pic.twitter.com/ZfkWEmeASS
— BIG TV Breaking News (@bigtvtelugu) May 23, 2026
Also Read: మీ ఆరోగ్యానికి గ్యారెంటీ.. 5 బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ లిస్ట్ మీకోసం!