Independence Day 2025: భారతదేశం ఇవాళ 79వ స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటుంది. ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. ‘స్వేచ్ఛను గౌరవిద్దాం, భవిష్యత్తుకు ప్రేరణ ఇస్తాం’ అని ఈసారి వేడుకలకు థీమ్ ఇచ్చారు. ఉదయం 7:21 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటకు చేరుకున్నారు. 7:30 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు.. ఆ తర్వాత జాతీయ గీతం పాడారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ గౌరవ వందనం సమర్పించాయి. 21 తుపాకుల గౌరవ సాల్వోతో వేడుకలు జరిగాయి. తర్వాత మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు, అలాగే జాతీయ ఐక్యత, సాంకేతిక పురోగతిపై దృష్టి సారించారు.
ఈ వేడుకల కోసం ఎర్రకోట దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులు, వివిధ రంగాల నుంచి ఆహ్వానితులు హాజరయ్యారు. వేడుకలకు వచ్చే వారి కోసం ఢిల్లీ మెట్రో ఉదయం 4:00 గంటల నుంచి సేవలు అందించింది.
ఢిల్లీలో ఘనంగా వేడుకలు
ప్రధాని నరేంద్ర మోదీ.. రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత.. అమర జ్యోతికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత రెడ్ ఫోర్ట్ దగ్గర.. త్రివిధ దళాల నుంచి గార్డ్ ఆఫ్‌హానర్ తీసుకున్నారు.
ప్రధాని మోదీ..
ఈ సారి ఆగస్టు15కు ఒక విశేషం ఉంది. అదేంటంటే.. ఆపరేషన్ సిందూర్ ద్వారా విజయం చేకూర్చిన వారికి సెల్యూట్ చెయ్యాలి. మన వీర జవాన్లు.. దుర్మార్గులకు చెక్ పెట్టారు. పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగింది. పిల్లల ముందే తండ్రిని చంపారు. మతాన్ని అడిగి మరీ ప్రాణాలు తీశారు. భారత్ ఏకమైంది. ఆ ఆక్రోశం నుంచి వచ్చిందే ఆపరేషన్ సిందూర్. మన సైన్యానికి పూర్తి స్వేఛ్ఛనిచ్చాం. యుద్ధ నీతితో మనం లక్ష్యం సాధించాం. వందల మంది ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేశారు. ఉగ్రవాదుల ఆటలు సాగట్లేదు. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ అనేది న్యూ నార్మల్. ఉగ్రవాద దాడి జరిగితే, మనం ఆపరేషన్ సిందూర్ ద్వారా సమాధానం ఇస్తాం. అణుదాడి చేస్తామన్నా.. మనం తగ్గలేదు. వాళ్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నా.. తగ్గేదే లేదు” అని ప్రధాని మోదీ ఎర్రకోటపై ప్రసంగంలో అన్నారు.
Also Read: ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు..! మరో రెండు రోజులు కుండపోత వర్షాలు.
దేశ ప్రజలకు మోదీ సందేశం..
మువ్వన్నేల పతాకం దేశమంతటా ఎగరాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం అంతటా ఒకటే సమైక్య భావంతో ఉప్పొంగే సమయం అన్నారు. నయా భారత్ థీమ్‌తో ఈ వేడుకలు జరుగాయి. ఎర్ర కోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రతి ఇంటిపై జెండా ఎగరాలన్నారు. ఇది 140 కోట్ల మంది సంకల్ప పండుగ అన్నారు. ఎందరో మహానుభావులు, స్వాతంత్య్ర సమర యోధుల కృషితో స్వాతంత్య్రం వచ్చిందని మోదీ గుర్తు చేసుకున్నారు. వారందరికీ వందనం చేస్తున్నానని అన్నారు.
“ఇవాళ మనం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని జరుపుకుంటున్నాం. ఆయన దేశం కోసం బలిదానం చేశారు. కోట్ల మంది త్యాగాలతో స్వాతంత్య్రం వచ్చింది. ఇవాళ లక్ పతి దీదీ, డ్రోన్ దీదీ వంటి వారు ఇక్కడకు వచ్చారు. నా ముందు అందరూ ఉన్నారు. టెక్నాలజీకి సంబంధించి విశాల భారత్ నుంచి వచ్చిన వారు ఉన్నారు. అందరికీ అభినందనలు చెబుతున్నాను” అని మోదీ తెలిపారు. సోషల్ మీడియాపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ. సొంతంగా అలాంటి ప్లాట్‌ఫామ్స్ వైపు యువత దృష్టి పెట్టాలని సూచించారు. విదేశీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై మనం ఎందుకు ఆధారపడాలని అన్నారు.
సోషల్ మీడియాపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వైపు దేశ యువత దృష్టి పెట్టాలని సూచించిన మోదీ
విదేశీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై మనం ఎందుకు ఆధారపడాలని హితవు #IndependenceDay #IndependenceDayIndia pic.twitter.com/g3CTausln6
— BIG TV Breaking News (@bigtvtelugu) August 15, 2025