Father Daughter Incident: ఒక అమ్మాయి అమ్మ ఎంత ప్రేమగా చూసుకున్న.. నాన్న అంటేనే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. తండ్రికి కూడా కొడుకు కన్నా.. కూతురంటేనే ఎక్కువగా ఇష్టముంటుంది. కూతురు తండ్రిని అమ్మలా చూసుకుంటుందని ఆ తండ్రి నమ్మకం.. ఇది అందరి ఇళ్లలో సహజంగా ఉండేదే.. అయితే ఇక్కడ ఓ కిరాతక సైకో తండ్రి అమ్మలా చూసుకోవాల్సిన కూతురిని కాళ్లతో తన్ని మరి దాడి చేశాడు.
కూతురిని తన్నుతూ.. చిత్రహింసలకు గురిచేశిన దుర్మార్గపు తండ్రి
అయితే కన్న కూతురి పాదాలను నెత్తిపై పెట్టుకొని చూసుకుంటున్నారు కొందరు తల్లితండ్రులు. కానీ ఈ తండ్రి మాత్రం ఆదివారం రోజూ తన కూతురు బుద్దిగా ఇంట్లో కూర్చోని చదువుకుంటుంటే.. ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి కాళ్లతో పైశాచికంగా దాడి చేశాడు సైకో తండ్రి. నాలుగో తరగతి చదువుతున్న కూతురి లింమ్సిక ముఖంపై కాళ్లతో తన్నుతూ.. బూతులు తిడుతూ.. చిత్రహింసలకు గురిచేశాడు దుర్మార్గపు తండ్రి.
క్రికెట్ బెట్టింగ్లు పెట్టి అప్పుల పాలై మద్యానికి బానిసైన రమేష్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడుకు చెందిన మిరియాల రమేష్ … సారపాకలోనీ ఐటీసీ పేపర్ పరిశ్రమలో పర్మినెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. భార్యతో కలిసి సారపాకలో ఇంటినీ అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడిన రమేశ్.. బెట్టింగ్‌లో అప్పుల పాలై మద్యానికి బానిసయ్యాడు. మద్యం సేవించి తరచు గొడవ పడుతూ ఉండేవాడు. ఇదంతా మానేసి చక్కగా ఉద్యోగం చేసుకోమని ఎంతమంది చెప్పిన తనలో మాత్రం మార్పు రాలేదు. రమేష్ వేధింపులు తట్టుకోలేక కూతురితో కలిసి భార్య భవాని పలు మార్లు పుట్టింటికి కూడా వెళ్ళింది.
4వ తరగతి చదువుతున్న రమేష్ కూతురు లింమ్సిక
శనివారం నైట్ షిప్ట్ చేసుకుని ఆదివారం ఇంటికి వచ్చిన తర్వాత.. ఇంట్లో బుద్దిగా చదువుకుంటున్న తన కూతురి ముందే కుర్చీలో కూర్చొని కాళ్లతో ముఖంపై తన్నుతూ, తిడుతూ మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేశాడు. ఈ ఘటనను చూస్తూ.. అక్కడే ఉన్న తన భార్య వద్దు రాము.. ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పిన వినకుండా అలాగే ప్రవర్తించాడు. రమేష్ ఆగడాలకు విసిగిచెందిన అతని భార్య తన బుద్ది.. తను ఎలా ప్రవర్తిస్తున్నాడో అందరికి తెలియాలని వీడియో రికార్డ్ చేసింది.
Also Read: నాగం రాజకీయ సన్యాసం?
రమేష్‌ను కఠినంగా శిక్షించాలని.. భార్య, కూతురి ఆరోపణ
అయితే అతని పైశాచిక అనందం కోసం ఆ విడియోను వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడు. దీన్ని చూసిన కొందరు అతన్ని మందలించడం కూడా జరిగింది. అయిన వినకపోవడంతో అతని కూతురే 1098కి ఫోన్ చేసి ఫోలీసులకు కంప్లైంట్ చేసింది. వెంటనే బూర్గంపాడు PSలో కేసు నమోదు చేసి దుర్మార్గుడిని అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి కూతురు తప్పు చేస్తే మందలించాల్సిన తండ్రి.. కానీ, తండ్రే తప్పు చేస్తే.. ఇక ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ దొరుకుతుంది. ఇలాంటి తండ్రిని కఠినంగా శిక్షించాలని కన్న కూతరినే చిత్రహింసలు పెట్టిన వీడిని అస్సలు వదలకూడదని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.