Tamil Dubbed telugu Films: సినిమా ఇండస్ట్రీలో ఒక భాషలో విడుదలైన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం అనేది సర్వసాధారణం. ఇప్పటికే తెలుగులో వచ్చిన సినిమాలని హిందీ, తమిళ, కన్నడ, మలయాళం ఇలా పలు భాషల్లో రీమేక్ చేశారు. అలాగే తమిళ, హిందీలో విడుదలైన సినిమాలను తెలుగులో రీ మేక్ చేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ రీ మేక్ చేసే విషయంలో సినిమా టైటిల్ లు, అందులో ఏ ఊరిలో అయితే షూటింగ్స్ చేస్తారో ఆ ఊరి పేర్లలో మార్పులు చేర్పులు చేయడం కాస్త ఇబ్బందిగా ఉంది.అయితే తాజాగా ఓ సినిమా విషయంలో కూడా అలాంటి ఇబ్బందే ఏర్పడింది. అదే తమిళ నటుడు సూర్య నటించిన కరుప్పు మూవీ (Karuppu)..
కరుప్పు.. కంటెంట్ తగ్గట్టుగా టైటిల్ లేదే?
తమిళ్ నటుడు సూర్య(Suriya) హీరోగా, త్రిష కృష్ణన్ (Trisha Krishnan) హీరోయిన్ గా ఆర్.జె. బాలాజీ(R.J. Balaji) దర్శకత్వం వహిస్తున్న తాజా మూవీ కరుప్పు.. డ్రీమ్ వారియర్స్ పిక్చర్ బ్యానర్లో ఎస్.ఆర్ ప్రభు (S.R. Prabhu),ఎస్.ఆర్ ప్రకాష్ బాబు(S.R. Prakash Babu)లు నిర్మాతలుగా చేస్తున్న కరుప్పు మూవీ చిత్ర షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. అయితే తాజాగా సూర్య బర్త్డే సందర్భంగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. ఇక కరుప్పు అంటే తమిళంలో నలుపు అని అర్థం. కానీ ఈ సినిమాకి ఈ టైటిల్ ని ఏ విధంగా పెట్టారో తెలియడం లేదు అని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే కరుప్పు అనే మూవీ టైటిల్ ని తమిళంలో పెట్టినట్టు తెలుగులో కూడా అదే టైటిల్ ని పెట్టి సినిమాని అనౌన్స్ చేయడం తెలుగు ప్రేక్షకులకు నచ్చడం లేదు.
తమిళ్ ఫిలిం మేకర్స్ పై తెలుగు ఆడియన్స్ ఫైర్..
ముఖ్యంగా తెలుగు సినిమా విశ్లేషకులు తమిళంలో ఉన్న టైటిల్ ని తెలుగులో అదే పేరుతో విడుదల చేసినప్పుడు.. తమిళ టైటిల్ ని తెలుగు సినిమాకి కూడా వినియోగిస్తున్నారు. కానీ తమిళంలో సినిమా తీసేటప్పుడు తమిళ ఊరి పేర్లను ఉపయోగించి.. తెలుగులో చూపించినప్పుడు మాత్రం పేర్లు మారుస్తున్నారు. ఉదాహరణకు తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేస్తే దాని రాష్ట్రం లేదా గ్రామం పేర్లను మార్చకుండా అలాగే ఉంచండి. మీరు చెన్నై (Chennai)లో కథ జరిగితే దాన్ని తెలుగులో కూడా చెన్నై అనే పేరుతోనే ఉంచండి. కానీ చెన్నై అనే పేరును తొలగించి.. తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకునేలాగా వైజాగ్ (Vizag) లేదా ఆంధ్ర, తెలంగాణలోని వేరే ప్రాంతాల పేర్లను పెట్టి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం లాంటివి మాత్రం చేయకండి. తమిళంలో పెట్టిన టైటిల్ ని తెలుగులో కూడా పెట్టినప్పుడు.. తమిళంలో చూపించిన ఊరి పేరునే తెలుగులో కూడా చూపించండి.
టైటిల్ మార్చనప్పుడు.. ఊరు పేరు మారిస్తే మాత్రం హిట్ అవుతుందా?
తమిళ సినిమా పేర్లను అదే పేర్లతో తెలుగులో కూడా విడుదల చేసినప్పుడు నష్టం రాకపోవచ్చు. కానీ నిర్మాతలు టైటిల్ని మార్చనప్పుడు ఊరి పేర్లను మాత్రం ఎందుకు మారుస్తున్నారు అంటూ తెలుగు సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు మండిపడుతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించిన పోస్ట్ ఎక్స్ లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సదరు నెటిజన్ పెట్టిన పోస్ట్ బాగుందని.. తమిళ సినిమా టైటిల్స్ ను తెలుగులో మార్చకుండా అలాగే పెట్టినప్పుడు ప్రాంతాల పేరు మాత్రం ఎందుకు మారుస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సూర్య సినిమాలు..
ఇక సూర్య సినిమాల విషయానికొస్తే రీసెంట్గా నటించిన కంగువ (Kanguva) సినిమా భారీ డిజాస్టర్ అవ్వడంతో ఆయన ఆశలన్నీ కరుప్పు సినిమా మీదే ఉన్నాయి. ఇక త్రిష(Trisha) నటించిన థగ్ లైఫ్(Thug Life) మూవీ వల్ల కూడా చాలా విమర్శలు వచ్చాయి. మరి కరుప్పు సినిమా వల్ల త్రిషకి ఏమైనా గుర్తింపు వస్తుందో చూడాలి.
ALSO READ:HHVM: వీరమల్లు ప్రమోషన్స్ కి డుమ్మా కొట్టిన బాబీ డియోల్, అనసూయ.. ఆ కోపంతోనే ఇలా చేశారా?