E-Paper
Advertisement

Nandyal Road Accident: నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్ బస్సుని ఢీ కొట్టిన కారు, స్పాట్‌లో..

Nandyal Road Accident: నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్ బస్సుని ఢీ కొట్టిన కారు, స్పాట్‌లో..
Advertisement

Nandyal Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి ప్రైవేటు ట్రావెల్ బస్సుని ఢీ కొట్టింది. స్పాట్‌లో నలుగురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అసలేం జరిగింది?

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

శుక్రవారం వేకువజామున నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల-బత్తలూరు ప్రాంతాల మధ్య జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వైపు అతి వేగంగా వెళ్తున్న టొయోటా క్వాలిస్ (AP09 AH 0667) కారు అదుపు తప్పింది. తొలుత డివైడర్‌ని దాటి ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సుని బలంగా ఢీ కొట్టింది.

ఈ ఘటనలో కారులో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అందులోని మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్సులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వేగంతో బస్సుని ఢీకొట్టడం వల్ల కారు నుజ్జునుజ్జు అయ్యింది.

Advertisement

ట్రావెల్ బస్సుని ఢీ కొట్టిన కారు

ఘటన సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. స్పాట్‌లో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారంతా హైదరాబాద్ కి చెందినవారు. ఘటన గురించి తెలియగానే డీఎస్పీ ప్రమోద్ అక్కడికి చేరుకున్నారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీశారు.

అంబులెన్స్ సాయంతో గాయపడిన వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్రేన్ సాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. ఘటన సమయంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ:  తెలంగాణలో పరువుహత్య..  ప్రేమ పేరుతో విద్యార్థిని ఆత్మహత్య

ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తోంది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. వారిని మరొక బస్సులో వారి గమ్య స్థానాలకు తరలించారు.
ప్రమాదంలో మృతి చెందినవారు హైదరాబాద్‌లోని నిజాంపేట్ ప్రాంతానికి చెందినవారు.

మృతులు గుండేరావు, శ్రావణ్, నరసింహా, బన్నీలు. నిజాంపేటలో క్యాటరింగ్ నిర్వహిస్తున్నాడు గుండేరావు. ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వం ఆసుపత్రిలో సాయి, సిద్ధార్థ ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×