Guntur Crime News: సమాజంలో ఆయన బాధ్యత కలిగిన ఆఫీసర్. అలాగని డబ్బులకు కొదవలేదు. ఫ్యామిలీ సభ్యులతో హుందాగా వ్యవహరించాల్సింది పోయి రోడ్డున పడ్డాడు. కారణాలు ఏమైనా కావచ్చు.. అడ్డంగా బుక్కయ్యాడు. చివరకు భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ టార్చర్ వెనుక ముమ్మాటికీ అక్రమ సంబంధమే కారణమన్న వాదన సైతం లేకపోలేదు. సంచలనం రేపిన ఈ ఘటన గుంటూరులో వెలుగుచూసింది.
భార్యను చావబాదిన డీఐజీ
గుంటూరు జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ కిరణ్‌కుమార్ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న ఆయన, ఆ ఫోటోలను ఏకంగా కట్టుకున్న తనకే పంపి మానసిక వేధింపులకు గురి చేసేవాడని భార్య ప్రధాన ఆరోపణ. ఇదేంటని ప్రశ్నించిన భార్యను చితకబాదాడు. కట్టుకున్న భార్యకు చిత్రహింసలు పెట్టాడు. కొన్నాళ్లుగా ఈ వ్యవహారం సాగుతున్న బయటపడలేదు.
చివరకు భర్త దాడిలో స్పృహ కోల్పోయింది ఆమె. బాదితురాలిని స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. భర్త ఆగడాలు తట్టుకోలేక అరండల్ పేట స్టేషన్‌లో కిరణ్‌పై బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో కిరణ్‌పై స్టేషన్‌లో కేసు నమోదైంది. భార్యకు అండగా వచ్చిన బంధువులపై అట్రాసిటీ కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు.భర్త దాడిలో గాయపడ్డ మహిళ ఎల్‌ఐసీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. కిరణ్-బాధిత మహిళది ప్రేమ వివాహంగా తెలుస్తోంది.
అసలు స్టోరీ ఏంటి?
పైన కనిపిస్తున్న వ్యక్తి పేరు కిరణ్‌కుమార్. స్టాంప్స్-రిజిస్ట్రేషన్ శాఖలో నెల్లూరు డీఐజీగా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన సెలవులో ఉన్నారు. ఎల్‌ఐసీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న అనసూయ రాణిని కొన్నేళ్ల కిందట లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పోస్టల్ కాలనీలో ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంపతుల మధ్య ఏం జరిగిందో తెలీదు. సాఫీగా సాగుతున్న కిరణ్ సంసారంలో ఒక్కసారిగా కలతలు మొదలయ్యాయి.
ALSO READ: పదవ తరగతి విద్యార్థినికి గర్భం.. బిడ్డకు జన్మనిచ్చి మృత్యు ఒడికి..
ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే కావడంతో నిధులకు ఎలాంటి ఢోకా లేదు. కాకపోతే పర్సనల్‌గా ఏమైనా సమస్యలా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీన్ కట్ చేస్తే.. దంపతుల మధ్య తరచూ విభేదాలు మొదలయ్యాయి. ఈ టార్చర్ ఎందుకని ఏడాది నుంచి వేర్వేరుగా ఉంటున్నారు కిరణ్-రాణి.
ఆదివారం రాత్రి దంపతుల మధ్య మాటా మాటా చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఘర్షణకు దారితీసింది. ఆగ్రహంతో రగిలిపోయిన కిరణ్ కుమార్, ఒక్కసారిగా భార్యపై దాడి చేశాడు.. విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. కిరణ్ ఇంట్లో కేకలు వినబడడంతో ఇరుగు పొరుగు వారు అక్కడికి వచ్చారు. గాయపడిన రాణిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత బాధితురాలు గుంటూరు అరండల్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేసింది.
కిరణ్‌కుమార్ గతంలో గుంటూరు స్టాంప్స్, రిజిస్ట్రేషన్ డీఐజీగా విధులు నిర్వహించిన విషయం తెల్సిందే. ఫిర్యాదు తర్వాత అనసూయ రాణి మీడియాతో మాట్లాడారు. తామిద్దరం ప్రేమ వివాహం చేసుకున్నామని, పిల్లలు పుట్టకపోవటంతో ఓ పాపను దత్తత తీసుకున్నామని చెప్పారు. సరోగసీ ద్వారా 2012లో బాబుకు జన్మనిచ్చినట్లు చెప్పుకొచ్చారు రాణి.
కొన్నేళ్లుగా వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న కిరణ్, తనను ఇబ్బంది పెడుతున్నారని మనసులోని మాట బయటపెట్టేసింది ఆ ఇల్లాలు. ఆయన పెట్టే వేధింపులు భరించలేక గడిచిన పది నెలల నుంచి వేర్వేరుగా ఉంటున్నట్లు తెలియజేసింది. పాప విదేశాల్లో చదువుకుంటుండగా, బాబు తనతోనే ఉంటున్నాడని వెల్లడించింది. రెండు రోజుల కిందట తన బంధువుల ఇంటికి వెళ్తుంటే బాబును, తనను కిరణ్ కొట్టాడన్నది రాణి ప్రధాన ఆరోపణ. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు.
స్టాంప్స్ అంటే రిజిస్ట్రేషన్ డీఐజీ వికృత చేష్టలు.. కట్టుకున్న భార్యకు చిత్రహింసలు
పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న అధికారి కిరణ్
వేరే మహిళలతో ఉన్న ఫోటోలు భార్యకు పంపి మానసిక వేధింపులు
గత రాత్రి భార్యను చితకబాదిన భర్త.. దాడిలో స్పృహ కోల్పోయిన భార్య
భర్తపై అరండల్‌పేట… pic.twitter.com/99I87QgjOo
— BIG TV Breaking News (@bigtvtelugu) February 18, 2025