Delta Airlines Plane Crash: కెనడాలో ఘోర ప్రమాదం తప్పింది. టొరెంటోలో రన్‌వేపై విమానం పల్టీ కొట్టింది. తలక్రిందులుగా బోల్తా పడటంతో 18 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మంచు కారణంగా విమానం స్కిడ్ అయినట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే అలర్టయిన అధికారులు…సహాయక చర్యలు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. కెనడాలోని విమానశ్రయంలో ఫ్లైట్ అదుపు తప్పి బోల్తాపడింది. టొరంటో పియర్‌సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం మధ్యహ్నం 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో సుమారు 18 మందికి గాయాలు కాగా, అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం యూఎస్‌లోని మినియాపొలిస్ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది అప్పమత్తం కావడంతో పెను ప్రమాదమే తప్పింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో చిన్నారితో పాటు ఓ మహిళ, ఇంకొక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా వారికి స్వల్పంగా గాయాలు అయినట్లు సిబ్బంది పేర్కొంది.
ప్రమాదాని గురైన విమానంలో 76 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సహా మొత్తం 80 మంది ఉన్నట్లు విమానాశ్రయ యాజమాన్యం వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్లైట్ అదుపుతప్పి పల్టీలు కొట్టిన అనంతరం దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బది హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకుని.. ఫైర్ ఇంజన్ల సహాయంతో వాటిని అదుపు చేశారు. విమానంలోని కొందరు ప్రయాణికులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, కొందరి మాత్రమే స్వల్ప గాయాలు అయినట్లు పేర్కొన్నారు.
Also Read: మనుషులను మింగేస్తున్న ‘బంగారు’ గనులు, 42 మంది మృతి
కాగా ఆదివారం నాడు కెనడాలో భారీ మంచు తుఫాను సంభవించింది. దీని కారణంగా బలమైన చల్లటి గాలులు, అతి తీవ్రమైన చలితో అక్కడి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఈ తుఫాను ప్రభావం వల్లన పలు విమానాలు రద్దయ్యాయి. అయితే సోమవారం నాడు కొంత మెరుగుపడిన కనిష్ట ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరింది. తీవ్రమైన మంచు, ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ విమానం ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
#Internacional | Un nuevo video en redes sociales muestra el instante en que un avión de Delta Airlines se estrella y se vuelca en un aeropuerto de Canadá. pic.twitter.com/CfmY78LZPA
— Porttada (@porttada) February 18, 2025
Visuals from inside the flipped Delta Airlines plane at the Toronto Pearson Airport crash site #Toronto #TorontoPlaneCrash #PearsonAirport https://t.co/98DPFPAqk1 pic.twitter.com/hAXCcZRehY
— Gagandeep Singh (@Gagan4344) February 18, 2025
Breaking : A Delta Airlines plane crash-landed at Toronto Pearson Airport, flipping completely upside down.
Initial reports indicate a Delta Airlines CRJ-900, operating as Delta Flight 4819 from Minneapolis (MSP) to Toronto (YYZ), was involved. The plane has reportedly flipped… pic.twitter.com/NZftfhrvEa
— Gagandeep Singh (@Gagan4344) February 17, 2025