BigTV English

Naga Shourya : తల్లిని దూరం పెట్టిన యంగ్ హీరో.. పెళ్లి తర్వాత ఇంత జరిగిందా..?

Naga Shourya : తల్లిని దూరం పెట్టిన యంగ్ హీరో.. పెళ్లి తర్వాత ఇంత జరిగిందా..?

Naga Shourya : టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య (Naga Shourya ) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే నటుడుగా మంచి మార్కులు వేయించుకున్నాడు. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో మంచి సినిమాలే చేశాడు. ఈమధ్య ఈ హీరోకి పెద్దగా కలిసి రాలేదని తెలిసిందే. ఈ మధ్య నాగశౌర్యకు పెద్దగా కలిసి రావడం లేదనే చెప్పాలి. ఒకప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు, హిట్స్‌తో అలరించిన ఈ హీరో ప్రస్తుతం సినిమాలు బాగా తగ్గించాడు. దీంతో ప్రస్తుతం ఈ హీరో మంచి సాలీడ్‌ హిట్‌ కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలో చివరగా ‘రంగబలి’ ( Rangabali ) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా హీరోను బాగా డిస్పాయింట్ చేసింది. అయితే ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడని వార్తలు వినిపిస్తుంది. అయితే తాజాగా నాగశౌర్య వాళ్ళ అమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్బంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక విషయాలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.


హీరో నాగశౌర్య వాళ్ళ అమ్మ ఉష ప్రొడక్షన్ కంపెనీతోపాటు రెస్టారెంట్లను కూడా స్టార్ట్ చేసి మంచి సక్సెస్ ని అందుకున్నారు.. రెస్టారెంట్ ని స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే మంచి పేరును తెచ్చుకున్నారు ఇప్పుడు నగరంలో పలు బ్రాంచ్లను ఓపెన్ చేసి అక్కడ కూడా సక్సెస్ ని అందుకున్నారు.. ఈ సందర్భంగా ఆమె పలు చానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తన సక్సెస్ సీక్రెట్ ని పంచుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఉషా.. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తన రెస్టారెంట్ స్పెషల్ ఐటమ్స్ గురించి వివరించారు. అలాగే నాగశౌర్య గురించి ఇంటర్వ్యూలు అడగ్గా ఆమె ఎమోషనల్ అయింది. ప్రస్తుతం నాగశౌర్య తన దగ్గర లేడన్న నిజాన్ని బయటపెట్టింది. చిన్నప్పటినుంచి వాడికి పెళ్లి వరకు నీతో ఉంటాను పెళ్లయిన తర్వాత దూరంగా వెళ్ళిపోతానని అన్నాడు అనుకున్నట్లుగానే వేరు పెళ్లి అవ్వగానే వేరేగా ఫ్యామిలీని పెట్టి దూరంగా ఉంటున్నారని ఆమె చెప్పింది. ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తారు అంతేతప్ప వాళ్ళు మా దగ్గర లేదని బాధ మాకు అలానే ఉందని ఆ ఇంటర్వ్యూలో ఉషా అన్నారు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో నాగశౌర్య తల్లికి దూరంగా ఉన్నాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటీజన్స్..

Also Read : జానీ మాస్టర్ చేసిన తప్పు అదే.. కస్తూరి మాస్టర్ షాకింగ్ కామెంట్స్..


ఇక నాగ శౌర్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నారి నారి నడుమ మురారీ, పోలీస్ వారి హెచ్చరిక తో పాటు మరో సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చెయ్యనున్నారు. ఈ సినిమాల్లో ఒక్క సినిమా హిట్ అయినా కూడా హీరో హిట్ ట్రాక్ మళ్లీ యూ టర్న్ తీసుకుంటుంది.. మరి ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటాయో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×