SSMB 29 Update : జక్కన్న (SS Rajamouli) మోప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ SSMB 29 ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తుంటే, ప్రియాంక చోప్రా (Priyanka Chopra)ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రియాంక చోప్రా త్వరలోనే ముంబైకి జంప్ కాబోతుందని తెలుస్తోంది. మరి ప్రియాంక అప్పుడే ముంబైకి ఎందుకు వెళ్ళిపోతోంది? SSMB 29 మూవీ షూటింగ్ ఎక్కడ దాకా వచ్చింది? అనే వివరాల్లోకి వెళ్తే….
ముంబైకి ప్రియాంక చోప్రా…
దర్శకు దిగ్గజం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్లో రాబోతున్న SSMB 29 మూవీ షూటింగ్ ఎట్టకేలకు మొదలైంది. జనవరిలో సైలెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కానిచ్చి, ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకుండానే షూటింగ్ కూడా మొదలుపెట్టేసాడు జక్కన్న. ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హైదరాబాద్ కి రావడంతో ఆమె రాజమౌళి – మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందనే వార్త బయటకు వచ్చింది.
ఇక ఈ మూవీకి సంబంధించిన వర్క్ షాప్స్ ఇప్పటికే నిర్వహించగా, షూటింగ్ కూడా మొదలు పెట్టారు జక్కన్న. ఇప్పటివరకు ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ శివార్లలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేశారు. ఇంకా అక్కడే షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ షూటింగ్లో ప్రియాంక చోప్రా (Priyanka Chopra)కు చెందిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రియాంక త్వరలోనే ముంబైకి వెళ్ళిపోబోతోంది.
మరి షూటింగ్ జరుగుతుండగానే ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఎందుకు ముంబైకి వెళుతుంది ? అంటే… SSMB 29 ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాబోతోంది. ఫిబ్రవరి 3న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. దీంతో ప్రియాంక చోప్రా షెడ్యూల్ పూర్తి చేసుకుని, ముంబైకి వెళ్ళిపోతుందని సమాచారం. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కి సంబంధించిన వివరాలు ఇంకా తెలియల్సి ఉంది.
ప్రియాంక చోప్రాకు భారీ రెమ్యునరేషన్
ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నిజానికి SSMB 29 మూవీ కంటే ముందు బాలీవుడ్ లో ఓ సినిమాతో రీఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. ‘జీ లే జరా’ అనే టైటిల్ తో ఈ మూవీ రాబోతోందని ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీలో ప్రియాంక చోప్రాతో పాటు కత్రినా కైఫ్, అలియా భట్ కీలకపాత్రలు పోషిస్తారని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి అయ్యిందని ఫర్హాన్ అక్తర్ అనౌన్స్ చేశారు. కానీ రెమ్యూనరేషన్ విషయంలో డిఫరెన్సెస్ రావడంతో ఈ మూవీని ప్రియాంక పక్కన పెట్టినట్టు టాక్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ప్రియాంక చోప్రా SSMB 29 మూవీ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. గ్లోబల్ బ్యూటీ ఈ మూవీ కోసం ఏకంగా 30 కోట్లు పారితోషికంగా తన ఖాతాలో వేసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ నేషనల్ వైడ్ గా ఈ రూమర్ చక్కర్లు కొడుతోంది.