Gangasaram Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాం జరిగింది. చిత్తూరు శివారు ప్రాంతం గంగసాగరం సమీపంలో ఆగివున్న టిప్పర్ ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి సీరియస్ గా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
రంగనాథన్ ఇన్ ట్రావెల్స్ బస్సు బస్సు తిరుపతి నుంచి మధురై వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ యాక్సిడెంట్ అయ్యింది. తచ్చూరు హైవే నిర్మాణ పనుల్లో భాగంగా ఓ టిప్పర్ గాజులపల్లి ఫ్లై ఓవర్ దగ్గర ఆగి ఉంది. అదే సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంగా దూసుకొచ్చింది. ఎదురుగా ఉన్న టిప్పర్ ను తప్పించాలని డ్రైవర్ ప్రయత్నించాడు. అయినప్పటికీ సాధ్యం కాకపోవడంతో టిప్పర్ ను ఢీకొని డివైడర్ కు తగిలించాడు. బస్సు వేగంగా ఉండటంతో బస్సు 20 అడుగులు ఎగిరిపడింది. రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలోని కరెంట్ పోల్ ను బస్సు ఢీకొట్టింది. బస్సు వేగం ధాటికి కరెంటు పోల్ బస్సులోకి చొచ్చుకుపోయింది.
నలుగురు స్పాట్ డెడ్.. పలువురికి తీవ్ర గాయాలు
ఈ ప్రమాదంలో బస్సులో వెళ్తున్న నలుగురు ప్రయాణీకులు స్పాట్ లోనే చనిపోయారు. మరో 40 మంది గాయాపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి సీరియస్ గా ఉంటుంది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. బాధితులను అంబులెన్స్ లలో వడంతో.. నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీరియస్ గా ఉన్న ఆరుగురిని చీలాపల్లి సిఏంసి ఆసుపత్రి కు తీసుకెళ్లారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Read Also: చంపి.. పూడ్చేసి.. అక్కడే పిండి వంటలు, వామ్మో ఇంత కిరాతకులు ఏంట్రా బాబూ!
క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్
ప్రమాద విషయం తెలుసుకున్నన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి.. బాధితులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులు అందరికీ మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కలెక్టర్ ఆదేశించారు.
Read Also: పండుగపూట విషాదం, ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఎంత మంది చనిపోయారంటే..?