Sankranthiki vastunnam 3 Days collections :2025 సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు పోటీపడ్డారు. అందులో రామ్ చరణ్(Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)సినిమాతో జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) దర్శకత్వంలో చేసిన చిత్రం ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj). ఈ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్, యాక్షన్ జానర్ చిత్రాలు చూసేవారికి ఈ సినిమా పరవాలేదు. కానీ అన్ని వర్గాలను మెప్పించలేకపోయింది. ఇక చివరిగా సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunnam). వెంకటేష్(Venkatesh ), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి వచ్చిన చిత్రం ఇది. జనవరి 14వ తేదీన విడుదలైన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటూ.. కలెక్షన్ల పరంగా భారీగానే సొంతం చేసుకుంది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా విడుదలైన 3 రోజుల్లోనే దాదాపు రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయి సరికొత్త రికార్డు సృష్టించింది.
ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్..
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు (Dilraju)నిర్మించారు. ఆంధ్ర, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ లో కలిపి 9 కోట్ల రూపాయలు..ఇక ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల రూపాయల మేరా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా.. బ్రేక్ ఈవెన్ రావాలి అంటే రూ.85 కోట్లు రాబటాల్సి ఉంటుందని మేకర్స్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం ఈ సినిమా థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
రూ.106 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సంక్రాంతికి వస్తున్నాం..
అందులో భాగంగానే మొదటి రోజు రూ.45 కోట్లు రాబట్టిన ఈ సినిమా ,రెండవ రోజు రూ.32 కోట్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక వెంకటేష్ జోరు చూస్తుంటే తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కొట్టేసి కొత్త సంవత్సరంలో క్లీన్ హిట్ గా నిలవబోతున్నారు అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు తాజాగా మూడవ రోజు కలెక్షన్స్ విషయానికే వస్తే.. ప్రపంచవ్యాప్తంగా రూ.29 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. మొత్తానికైతే మూడు రోజుల్లోనే రూ.106 కోట్ల గ్రాస్ వసూల్ తో వెంకటేష్ కెరియర్ లోని మెమొరబుల్ హిట్ గా నిలిచింది. ఈ విషయాన్ని మేకర్స్ పోస్టర్తో సహా రిలీజ్ చేస్తూ..” ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్.. విక్టరీ వెంకటేష్” అంటూ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఈ సినిమా ఇక వీకెండ్ నాటికి వెంకీ మామ మరెలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి అని అటు సినిమా ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ రాబట్టి, వరుస కలెక్షన్లు జుర్రుకుంటూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు వెంకటేష్ అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary) ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించారు . ఇద్దరు కూడా తమ పెర్ఫార్మన్స్ తో ఎవరికివారు పోటీగా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచారు.