మనుషులు మృగాలుగా మారిపోతున్నారు. ఏమాత్రం కనికరం లేకుండా హత్యలు చేస్తున్నారు. చేసిన దారుణాలను కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని ఘోరాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ లో అత్యంత కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. కలకాలం తోడుండాల్సిన భర్తే, తల్లిదండ్రులతో కలిసి ఘోరంగా హత్య చేశాడు. ఇంట్లోనే పూడ్చి పెట్టాడు. తాజాగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో అంతా షాక్ అయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
శవాన్ని పూడ్చిన చోటే సంక్రాంతి వంటలు
మహబూబాబాద్ లోని సిగ్నల్ కాలనీకి చెందిన గోపి.. నాగమణి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. గత ఏడాది కాలంగా ఇక్కడే నివాసం ఉంటున్నాడు. అన్యోన్యంగానే కలిసి ఉండే వారు. కుటుంబ సభ్యులు కూడా వారితోనే ఉంటున్నారు. కానీ, గత కొంతకాలంగా నాగమణితో భర్త గోపితో పాటు ఆమె అత్త కాటి లక్ష్మి, మామ రాములు గొడవ పడుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. సుమారు వారం రోజుల క్రితం రాత్రి వేళ గొడవ జరిగిందంటున్నారు. అదే రోజు, నాగమణిని చంపేసినట్లు భావిస్తున్నారు. విషయం బయటకు తెలియకుండా భర్త, అత్తమామలతో పాటు ఆడపడుచు, ఆమె భర్త కలిసి నాగమణి శవాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టారు. ఏమీ తెలియనట్లు మామూలుగానే ఉంటున్నారు.
శవాన్ని పాతిపెట్టిన చోటే సంక్రాంతి పిండి వంటలు
గోపి, ఆమె తల్లిదండ్రులు, సోదరి దుర్గ, ఆమె భర్త మహెందర్ కలిసి ఇంట్లోనే సంక్రాంతి పండుగ చేసుకున్నారు. బయటి వాళ్లకు అనుమానం రాకుండా నాగమణిని చంపి పాతిపెట్టిన చోటే, పొయ్యి పెట్టి సంక్రాంతి పండుగ వంటలు కూడా చేశారు. కొద్ది రోజులుగా నాగమణి కనిపించకపోవడంతో చుట్టుపక్కల వాళ్లు ఎక్కడికి వెళ్లిందని అడగడం మొదలు పెట్టారు. పండుగకు ఊరెళ్లిందని చెప్పారు. విషయం బయటకు తెలిసే అవకాశం ఉండటంతో సంక్రాంతి పండుగ తర్వాత ఇంటికి తాళం వేసి, నాగమణి భర్త, అత్తమామలు, ఆడపడుచు దంపతులు అక్కడి నుంచి పరారయ్యారు.
Read Also: పండుగపూట విషాదం, ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఎంత మంది చనిపోయారంటే..?
ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులు సమాచారం
ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూశారు. తాజాగా తవ్విన మట్టి నుంచి వాసన రావడంతో స్థానికుల సాయంతో మట్టి తొలగించారు. నాగమణి శవం బయట పడటంతో అందరూ షాక్ అయ్యారు. జిల్లా ఎస్పీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నమ్మి పెళ్లి చేసుకున్న అమ్మాయిని అర్థాంతరంగా చంపేశాడంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లు ఊళ్లో ఉండటం కూడా దరిద్రం అంటూ మండిపడుతున్నారు.
Read Also: నార్సింగి డబుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్, రెండో ప్రియుడే హంతకుడు!
Read Also: జుట్టు కత్తిరించి.. వివస్త్రను చేసి.. ప్రేమజంటకు సహకరించిందని మహిళపై పైశాచిక దాడి!