Kakinada Road Accident: బంధుమిత్రులంతా కలిసి హ్యాపీగా, జాలీగా సంక్రాంతి పండుగ ఎంజాయ్ చేశారు. మూడు రోజుల పాటు పిల్లా పాపలతో ఆహ్లాదంగా గడిపారు. పండుగ అయిపోవడంతో అంతా కలిసి టూర్ కు వెళ్లాలి అనుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన మినీ వ్యాన్ ను మాట్లాడుకున్నారు. అందరూ పొద్దున్నే బయల్దేరారు. ఇంతలోనే ఘోరం జరిగింది. ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. పలువురు చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. పిల్లల ఏడ్పులతో ఆప్రాంతం అంతా హృదయ విదారకంగా మారింది. ఈ ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ ట్రావెలర్ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి సీరియస్ గా ఉంటుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను చికిత్స కోసం ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు
ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. కాకినాడ నుంచి దారేపల్లి వెళ్తుంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సంక్రాంతి పండుగకు వచ్చిన బంధువులంతా గారెపల్లి వాటర్ ఫాల్స్ చూడ్డానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలంలో పరిస్థితి భయానకంగా మారింది. మృతులు రక్తం ముద్దలా మారిపోయారు. పిల్లలు రక్తాలు కారుతూ ఏడుస్తూ కనిపించారు. చూసిన వారిందరినీ ఈ ఘటన కంటతడి పెట్టించింది.
Read Also: సంక్రాంతికి ఊరెళ్లిన వారే టార్గెట్, ఏపీ, తెలంగాణలో పలు ఇండ్లను ఊడ్చేసిన దొంగలు!
Read Also: జుట్టు కత్తిరించి.. వివస్త్రను చేసి.. ప్రేమజంటకు సహకరించిందని మహిళపై పైశాచిక దాడి!
ముగ్గురి పరిస్థితి విషమం
ప్రస్తుతం గాయపడి చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. మరోవైపు చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. శవ పరీక్ష తర్వాత ఫార్మాలిటీస్ పూర్తయ్యాక మృతదేహాలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. పండుగ పూట ఇలా జరగడంతో బాధితుల గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Also: ఇంటి తాళం పగులగొట్టి 20 తులాల బంగారం, 25 లక్షలు చోరీ.. తెలిసిన వాళ్ల పనేనా?