CMR Collage Issue: సీఎంఆర్ కాలేజీ ఘటనపై పోలీసులు దర్యాప్తు సాగించారు. ఎట్టకేలకు ఇద్దరిని గుర్తించి, వారిని అరెస్ట్ చేసినట్లు మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇంకా కేసు దర్యాప్తు సాగుతుందని ఏసీపీ తెలపడం విశేషం. సీఎంఆర్ కాలేజీలో బాలికల వసతిగృహంలో గల బాత్ రూమ్ లను కొందరు వీడియోలు తీసినట్లు తాము గుర్తించామని ఇటీవల విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. విద్యార్థినులు బాత్ రూమ్ లలో ఉన్న సమయంలో వీడియోలు తీశారన్నది అసలు ఆరోపణ.
ఈ వ్యవహారంపై రెండు రోజులు వరుసగా విద్యార్థులు నిరసన కూడ తెలిపారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం భాద్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం తెలుసుకొనేందుకు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారనే చెప్పవచ్చు. కేసు గురించి బిగ్ టీవీతో ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు.
సీఎంఆర్ కాలేజీ ఘటనపై యాజమాన్యం నుండి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఏసీపీ అన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నామన్నారు. విద్యార్థులు స్నానం చేస్తున్నప్పుడు బాత్రూం వెనుక భాగంలో వ్యక్తులు తచ్చాడుతున్నట్టు గమనించామని విద్యార్థులు తమకు చెప్పినట్లు ఏసీపీ తెలిపారు. మహిళా పోలీసులతో బాత్రూముల దగ్గర చెక్ చేయించామని, ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ లభించాయన్నారు. మెస్‌లో పని చేసే వ్యక్తులు మాత్రమే లోపలికి వచ్చే అవకాశం ఉందని, ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న 12 సెల్ ఫోన్లను సీజ్ చేశామని ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Also Read: Telangana Govt: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు.. మళ్లీ ఎప్పుడో?
ఇప్పటివరకు అయితే ఎలాంటి వీడియోలు లభించలేదని, ఈ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోందన్నారు. విద్యార్థులతో స్టేట్‌మెంట్ రికార్డు చేశామని, ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతుందన్నారు. కాగా ఇదే ఘటనకు కారకులుగా ఇద్దరిని పోలీసులు గుర్తించారు. బాత్రూం వీడియోల కేసులో బీహార్ రాష్ట్రానికి చెందిన కిశోర్, గోవింద్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరూ దురుద్దేశపూర్వకంగా బాత్రూంలోకి తొంగిచూసినట్లు, అమ్మాయిల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించారు. అయితే ఈ ఘటనకు భాద్యులుగా కాలేజ్ చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డి, వార్డెన్ ప్రీతితో సహా మరో ఏడుగురిపై కేసు నమోదైంది.
సీఎంఆర్ కాలేజ్ హాస్టల్ ఘటన.. ఇద్దరు అరెస్ట్
బాత్రూం వీడియోల కేసులో బీహార్ రాష్ట్రానికి చెందిన కిశోర్, గోవింద్ అనే ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఈ ఇద్దరూ దురుద్దేశపూర్వకంగా బాత్రూంలోకి తొంగిచూసినట్లు, అమ్మాయిల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్టు గుర్తింపు
కాలేజ్ చైర్మన్ చామకూర… https://t.co/yhnRRWIr4w pic.twitter.com/k446P4MuBr
— BIG TV Breaking News (@bigtvtelugu) January 5, 2025