Prabhas:ప్రభాస్ చాలా అరుదుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. తన సినిమాకి సంబంధించిన పోస్టులు లేదా తనకి దగ్గరైన కొంతమంది హీరో, హీరోయిన్లకు సంబంధించిన సినిమా పోస్టర్లు తప్ప సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండరు. ఆయన ఎప్పుడు సినిమా సినిమా అంటూ సినిమా షూటింగ్స్ లోనే బిజీగా గడిపేస్తుంటారు. కానీ సోషల్ మీడియాని అంతగా పట్టించుకోరు. ఇక అలాంటి ప్రభాస్ చేతిలో ప్రస్తుతం స్పిరిట్, సలార్ 2, కల్కి 2, ది రాజా సాబ్, ఫౌజీ వంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ప్రభాస్ తాజాగా సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ కు సంబంధించి పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. మరి ఇంతకీ ప్రభాస్ ఏ హీరోయిన్ గురించి పోస్ట్ పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే (Deepika Padukone) బర్త్డే కావడంతో ఈరోజు సోషల్ మీడియాలో దీపిక పదుకొనే కి సంబంధించి చాలా మంది బర్త్డే విషెష్ లు తెలియజేస్తున్నారు. అలా తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రభాస్ కూడా దీపికా పదుకొనే కి సోషల్ మీడియా ద్వారా బర్త్డే విషెస్ తెలియజేశారు. “ఎవర్ టాలెంటెడ్ అయినటువంటి దీపిక పదుకొనే కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఎప్పటికీ అంతులేని హ్యాపీనెస్, ఆనందం ఇలాగే ఉండాలి” అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది ప్రభాస్ అభిమానులు కూడా దీపిక పదుకొనేకి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇక దీపికా పదుకొనే, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన కల్కి 2898 AD మూవీ భారీ అంచనాలతో విడుదలై రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఈ సినిమాలో ఉండే గ్రాఫిక్స్ హాలీవుడ్ లెవల్ లో ఉన్నాయని సినిమా చూసిన ప్రేక్షకులు, సినిమాని తెగ పొగిడారు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంది. అలా తన సినిమా హీరోయిన్ పుట్టినరోజు నాడు ప్రభాస్ ఆ హీరోయిన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక ప్రభాస్ పర్సనల్ విషయానికి వస్తే.. 40 ఏళ్లు దాటినా ఈయన ఇంకా పెళ్లి పీటలెక్కడం లేదు. ప్రభాస్ పెళ్లి విషయంలో ఫ్యాన్స్ ఎప్పుడు అసహంగానే ఉంటారు. ఇక ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి ఉంటుంది అని ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి చెప్పినప్పటికీ అందులో ఎంత నిజం ఉందో తెలియదు.ఎందుకంటే గత ఏడాది ప్రభాస్ పెళ్లి ఉంటుందని చెప్పింది కానీ అది జరగలేదు. ఇక ప్రభాస్ హెల్త్ విషయంలో ప్రతిసారి హాస్పిటల్లో చేరుతూనే ఉంటారు. ఇప్పటికే ఆయనకు రెండు మూడు సర్జరీలు కూడా అయ్యాయి. అటు హెల్త్ తో పాటు ఇటు సినిమాలు కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇక దీపికా పదుకొనే పర్సనల్ విషయానికొస్తే.. ఈమె గత ఏడాది దువా అనే పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం కూతురిని చూసుకుంటూ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది.