India : ఇండియా వర్సెస్ పాకిస్తాన్. బోర్డర్‌లో యుద్ధ వాతావరణం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఏ క్షణంలోనైనా పాక్‌పై అటాక్ చేసేందుకు రెడీ అవుతోంది ఇండియన్ ఆర్మీ. కమాన్ ఇండియా అంటూ భారతీయులంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ఆర్మీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆర్మీకి విరాళాలు ఇవ్వాలని అడిగితే.. ఇవ్వకుండా ఉండగలరా? దేశభక్తి పొంగుకొస్తున్న వేళ.. అకౌంట్‌లో ఉన్న డబ్బంతా ఇచ్చేయరూ. సరిగ్గా.. ఇదే పాయింట్ మీద రంగంలోకి దిగిపోయారు సైబర్ నేరగాళ్లు.
సెంటిమెంట్‌తో మోసాలు..
సైబర్ మోసగాళ్లకు అన్నీ అవకాశాలే. సిచ్యుయేషన్ ఏదైనా వాళ్లకు అనుకూలంగా మార్చుకోవడంలో ఎక్స్‌పర్ట్స్. ట్రెండ్‌ని ఫాలో అవుతారు. టైం చూసి కొల్లగొట్టేస్తారు. ప్రస్తుతం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతుండగా.. సెంటిమెంట్ అడ్డుపెట్టుకొని.. కొత్త తరహా మోసానికి రంగంలోకి దిగారు కేటుగాళ్లు.
ఆర్మీకి డొనేషన్స్.. అంతా ఫేక్
ఇండియన్ ఆర్మీకి విరాళాల పేరుతో వసూళ్ల దందా చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. భారత సైన్యం ఆధునికీకరణకు విరాళాలు ఇవ్వాలంటూ వాట్సాప్, టెలిగ్రామ్‌లో మెసేజ్‌లు పంపుతున్నారు. సోషల్ మీడియాలో లింక్స్ షేర్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. సైన్యం ఆధునికీకరణ, దాడుల్లో మరణించిన, గాయపడిన సైనిక కుటుంబాలకు చేయూత అందించేందుకు మోదీ ప్రభుత్వం కొత్తగా బ్యాంకు ఖాతా తెరిచిందని ప్రచారం చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ పేరుతో ఫేక్ సైట్స్ క్రియేట్ చేసి.. డొనేషన్స్ ఇవ్వాలంటూ మోసాలకు దిగుతున్నారు.
ఫేక్ లింక్స్.. బీ కేర్‌ఫుల్..
అది నిజమేనని నమ్మి నెటిజన్లు విరాళాలు ఇస్తున్నారు. అయితే.. అదంతా ఫేక్ అని, మోసపోవొద్దని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు విరాళాల సేకరణకు పీఎం కేర్స్ పేరును కూడా వాడుకుంటున్నారు. ఫేక్ లింక్స్‌తో జాగ్రత్తగా ఉండాలంటూ.. పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దని నెటిజన్లకు సూచిస్తున్నారు. దేశభక్తిని ఆసరాగా చేసుకుని మోసాలు చేస్తున్నారని, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు.
Also Read : పాక్ చెరలో భారత జవాన్.. ఎంతగా టార్చర్ చేస్తున్నారంటే..
ఏదీ ఈజీగా నమ్మేయొద్దు..
అది నిజమైనా సరే నమ్మ వద్దు. నిజంగా నిజమేనా అని ఒకటికి రెండు సార్లు కన్ఫామ్ చేసుకున్నాకే నమ్మాలి. చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తున్నారు సైబర్ క్రిమినల్స్. బర్త్ డే విషెష్ పేరుతో లింక్స్ పంపిస్తున్నారు. డిస్కౌంట్ కూపన్స్ అంటూ టెంప్ట్ చేస్తున్నారు. పొరబాటున ఓపెన్ చేశామో.. ఇక అంతే సంగతి. అకౌంట్ ఖాళీ. ఇటీవల సికింద్రాబాద్ ఏరియాలో.. ఇల్లు అద్దెకు ఇవ్వబడును అని ఆన్‌లైన్‌లో TO LET పోస్ట్ పెట్టింది ఓ మహిళ. అది చూసి కేటుగాళ్లు ఆమెకు ఫోన్ చేసి.. మాటలతో మస్కా కొట్టి.. లక్షన్నర కాజేశారంటే.. మోసగాళ్లు ఎంత పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేస్తున్నారో అర్థం అవుతోంది. ట్రేడింగ్ యాప్స్ అయితే అదో పెద్ద ఛీటింగ్. గంటల్లోనే పెట్టిన డబ్బులు డబుల్ అయినట్టు చూపిస్తారు. భారీ లాభాలొచ్చాయని విత్‌డ్రా చేద్దామంటే కుదరదు. మోసం అని తెలిశాక ఎంత మొత్తుకున్నా ఇక నో యూజ్. అట్లుంటది సైబర్ నేరగాళ్లతోని. మనమే జాగ్రత్తగా ఉండాలి మరి. లేదంటే, డబ్బులు లూటీ.. అకౌంట్లు ఖాళీ.