Vizianagaram Crime News: సమయం, సందర్భం వచ్చినప్పుడు ఫిల్మ్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఓ డైలాగ్ చెబుతాడు. క్రైమ్ తీరు ఏ మాత్రం మారలేదు. కాకపోతే దాని రూపం రకరకాలుగా ఉంటుందని అంటుంటాడు. ప్రస్తుతం అలాంటి ఘటనలు దేశంలో ఇబ్బడిముబ్బడిగా జరుగుతున్నాయి. విజయనగరం జిల్లాలో జరిగిన ఓ మహిళ హత్య ఇందుకు ఉదాహరణ.
ప్రియుడిపై మోజుతో కన్న తల్లిని కడ తేర్చింది కసాయి కూతురు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావించింది ఆ యువతి. ఈ విషయాన్ని తల్లి దృష్టికి చెప్పింది. లవ్ మ్యారేజ్‌కి అంగీకరించేది లేదని తెగేసి చెప్పింది. తల్లి నుంచి వచ్చిన సమాధానంతో షాకైంది కూతురు. తల్లి ఉన్నంతకాలం తనకు ప్రియుడితో పెళ్లి జరగదని భావించింది.
అడ్డు తొలిగించుకోవాలని భావించింది. ఇదే విషయాన్ని ప్రియుడితో చెప్పింది. పక్కా ప్లాన్‌తో రాత్రి 10 దాటిన తర్వాత ప్రియుడితో కలిసి తల్లిని చంపేసింది. పైకి ఏమీ తెలియనట్లు వ్యవహరించింది. బంధువుల ఫిర్యాదుతో ఈ కేసుపై పోలీసులు దృష్టి పెట్టారు.
అసలు ఏం జరిగింది?
విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం వెంకటరమణ పేటలో దారుణం జరిగింది. కూతురుతో కలిసి బహిర్భూమికి వెళ్లిన తల్లిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. వెంకటలక్ష్మి-సత్యనారాయణ దంపతులకు రెండు సంతానం. వారిలో ఓ కూతురు, కొడుకు ఉన్నారు. శనివారం రాత్రి 10 గంటల తర్వాత కూతురితో కలిసి బహిర్భూమికి వెళ్లింది వెంటకలక్ష్మ.
ALSO READ: అయ్యో దేవుడా ఎంత పని చేశావు, పాపం చిన్నారులు
అక్కడ ఏం జరిగిందో తెలీదు గానీ, కొద్దిసేపటికి ఆ బాలిక ఒంటరిగా ఇంటికి వచ్చింది. ఎవరో ఆటోలో వచ్చి అమ్మను ఎత్తుకెళ్లారని చెప్పింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. మరోవైపు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు, ఇంటి సమీపంలోని ఓ బావిలో వెంటకలక్ష్మి మృతదేహాన్ని గుర్తించారు.
ఈ సీన్‌ని చూసిన పోలీసులు, హంతకులు తొలుత వెంటకలక్ష్మి గొంతు కోసి చంపేశారు. ఆ తర్వాత చీర తీసి దాని సాయంతో మృతదేహాన్ని బండరాయికి కట్టి బావిలో పడేశారు. రాత్రి వేళ తల్లిని బయటకు తీసుకెళ్లిన కూతుర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఘటన గురించి బాలిక ప్రశ్నిస్తే రకరకాలుగా పొంతన లేని సమాధానాలు చెబుతోంది.
గ్రామస్తుల వెర్షన్ మరోలా ఉంది. వెంకటలక్ష్మి కూతురు కొన్నేళ్లుగా ఆ గ్రామానికి చెందిన ఓ యువకుడ్ని లవ్ చేస్తోంది. వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారన్న కారణంగా ఓసారి ఇద్దరు పురుగుల మందు తాగారు. ఈ వ్యవహారంలో ప్రియుడిపై రెండేళ్ల కిందట పోక్సో కేసు నమోదైంది. ఈ కేసు గురించి ప్రస్తుతం న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నాడు.
తన జీవితం ఇలా అయిపోవడానికి కారణం వెంకటలక్ష్మి కారణమని భావించాడు.. ఆపై కక్ష పెంచుకున్నాడు. స్థానికుల సహాయంతో వెంకటలక్ష్మి హత్య చేశాడని అనుమానిస్తున్నారు పోలీసులు. మరోవైపు ఘటన జరిగిన తర్వాత యువతి ప్రేమికుడితోపాటు ఇంకో వ్యక్తి కనిపించలేదు. వారికోసం గాలిస్తున్నారు పోలీసులు. వారిని పట్టుకుంటే ఈ కేసులో చిక్కుముడి వీడడం ఖాయమని అంటున్నారు.