Lucky Draw For Train Tickets: భారతీయ రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. తక్కువ ఖర్చుతో ఆహ్లాదకరమైన ప్రయాణం చేస్తుంటారు. అయితే, కొంత మంది ఇప్పటికీ టికెట్ లేకుండా రైలు ప్రయాణాలు చేస్తున్నారు. అలాంటి ప్రయాణాలను అడ్డుకునేందుకు ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. లక్కీ డ్రా పేరుతో టికెట్ రహిత ప్రయాణానికి చెక్ పెట్టబోతోంది. ఇంతకీ ఈ లక్కీ డ్రా కథ ఏంటంటే..
లక్కీ డ్రా పథకాన్ని ప్రారంభించిన ముంబై రైల్వే
ముంబై లోక్ ట్రైన్స్ ద్వారా నిత్యం 7.5 మిలియన్ల మంది ప్రయాణీకులు జర్నీ చేస్తేరు. వీరిలో చాలా మంది టికెట్ లేకుండా ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల భారతీయ రైల్వే ప్రతి ఏటా వేలాది కోట్ల రూపాయలు నష్టపోతోంది. అదే సమయంలో టికెట్ చెక్కర్ కు పట్టుబడితే, భారీగా జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇలాంటి వాళ్లు రైలు టికెట్లు కొనుగోలు చేయడానికి బదులుగా.. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లాటరీ టికెట్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే కూడా ప్రయాణీకులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. లక్కీ టికెట్ పేరుతో డబ్బులు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది.
Read Also: దేశంలో అత్యంత పొడవైన వందే భారత్ స్లీపర్ జర్నీ.. అదీ తెలుగు రాష్ట్రాల మీదుగా!
రోజుకు రూ. 10 వేలు.. వారినికి రూ. 50 వేల క్యాష్ ప్రైజ్
ముంబై రైల్వేలో టికెట్ లేని ప్రయాణానికి చెక్ పెట్టేలా ‘లక్కీ యాత్ర’ పేరుతో లక్కీ డ్రాను అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వే సంస్థ. ఇకపై ముంబై లోకల్ ట్రైన్ టికెట్ కొనుగోలు చేసిన ప్రతి టికెట్ లక్కీ టికెట్ కాబోతోంది. టికెట్ మీద ఉన్న ప్రతి పీఎన్ఆర్ నెంబర్ లక్కీ నెంబర్ కాబోతోంది. ప్రతి రోజు కొనుగోలు చేసిన అన్ని రైల్వే టికెట్లలో లక్కీ డ్రా ద్వారా ఒక టికెట్ ను ఎంపిక చేస్తారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి రూ. 10 వేలు క్యాష్ ప్రైజ్ ఇస్తారు. ప్రతి వారం ఓ లక్కీ టికెట్ కు రూ. 50 వేలు అందిస్తారు. కొనుగోలు చేసిన టికెట్ ను లక్కీ డ్రీ బాక్స్ లో వేయాల్సిన అవసరం లేదు. డిజిటల్ పద్దతిలోనే ఒక టికెట్ ను ఎంపిక చేస్తారు. ఇక లక్కీ డ్రా విజేతల టికెట్ నెంబర్లను ఆయా స్టేషన్లలో డిస్ ప్లే చేస్తారు. ఆ టికెట్ నెంబర్ ఉన్న ప్రయాణీకులు వచ్చి రైల్వే అధికారులకు చూపించి క్యాష్ ప్రైజ్ తీసుకెళ్లవచ్చు. సో, ఇకపై మీరు కూడా కచ్చితంగా టికెట్ కొనుగోలు చేసి రైల్లో ప్రయాణం చేయండి. ఏమో ఎవరి అదృష్టం ఎలా ఉందో ఎలా చెప్పలగం. ఆ లక్కీ డ్రా విన్నర్ మీరే కావచ్చు. ఈ విధానంతో ముంబై రైల్వే డివిజన్ పరిధిలో టికెట్ లెస్ ప్రయాణం ఉండదని అధికారులు భావిస్తున్నారు.
Read Also: దేశంలో అత్యంత పొడవైన 5 వందేభారత్ మార్గాలు ఇవే, ఒక్కోటి ఎన్ని కిలో మీటర్లు అంటే!