BigTV English

Gundeninda GudiGantalu Today episode: బాలుకు దిమ్మతిరిగే షాకిచ్చిన సత్యం.. భార్యలకు దూరంగా భర్తలు.. ఒక్కటైన తోడి కోడళ్లు..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు దిమ్మతిరిగే షాకిచ్చిన సత్యం.. భార్యలకు దూరంగా భర్తలు.. ఒక్కటైన తోడి కోడళ్లు..

Gundeninda GudiGantalu Today episode May 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా వాళ్ళ నాన్న సంవత్సరికం కోసం బాలును పిలుస్తారు. తీసుకోవాలనుకున్న కావాలనుకున్న బాలు వస్తాడు కానీ అప్పటికే పార్వతి తన అల్లుడు తన కొడుకు చేయని విరగొట్టాడని అందరికీ చెప్తూ ఉంటుంది. అది విన్న బాలు రెచ్చిపోతాడు. మరోసారి శివ పై దాడి చేస్తాడు. మీనా బాలుని కంట్రోల్ చేసి అక్కడి నుంచి పంపిస్తుంది. ఇక మీనా ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ బాలు చేసిన నిర్వాహకం గురించి అందరికీ చెప్తుంది. నా పుట్టింటి వాళ్ల మీద ఎందుకు ఇంత పగ పెంచుకున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. సత్యం ఎంత చెప్పినా కూడా బాలు వినకపోవడంతో సత్యం సీరియస్ అవుతాడు. తనను ఇంటికి పిలిచి మరీ అవమానిస్తున్నారని బాలు మండిపడుతాడు. శివ చేసిన తప్పును చెప్పలేక పోవడమే తన తప్పుగా అవుతుందని, దాంతో మీనాతో కూడా దూరం పెరుగుతూ వస్తోందని, రోజురోజుకు మీనా తనను నిందితుడిలాగా చూస్తోందని బాధపడుతూ ఉంటాడు. ఇక బాలు మీనాను పుట్టింటిలోనే వదిలేసి తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చే సరికి సత్యం కంగారు పడుతూ ఉంటాడు. అసలే అందరిపై ఈ మధ్య చిర్రు బుర్రులాడుతున్న బాలు అక్కడికి వెళ్లి ఎలాంటి గొడవ చేశాడోనని కంగారులో ఉంటాడు. అదే సమయంలో బాలు ఇంటికి తిరిగి వస్తాడు. అంతకంటే ముందే మీనా ఇంటికి వచ్చి ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా తన పుట్టింట్లో బాలు చేసిన నిర్వాహకం గురించి బయట పెడుతుంది. అక్కడ ఏం జరిగిందన్న విషయం సత్యంతో చెప్తుంది.. బాలు వచ్చే సరికి అక్కడ ఏం చేశావని ప్రశ్నిస్తాడు. అందుకు బాలు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏముంది మీ కోడలు మీనా చెప్పే ఉంటుంది కదా అని అంటాడు. ఇలా తిక్క తిక్కగా సమాధానం ఇస్తూన్నావేంటని సత్యం బాs మండి పడుతాడు. నిన్ను నేను ఎందుకు పంపించాను నువ్వు ఎందుకు వెళ్లావు? ఆ పని చూసుకొని రావాలి కానీ అక్కడ ఎవరేం మాట్లాడిన నువ్వు పట్టించుకోకుండా రావాలి అంతేకానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తావా ఇదేనా నీకు నేను నేర్పించిన సంస్కారం అని సత్యం బాలుని దారుణంగా తిడతాడు.. వాళ్ల నాన్న పోయిన బాధను దిగమింగుకొని మరోసారి గుర్తు చేసుకోవాలని వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటే నువ్వు నాశనం చేసి వస్తావా కొంచమైనా నీకు బుద్ధుండే చేస్తున్నావా..? నాతో మాట్లాడొద్దు అని అక్కడి నుంచి సత్యం వెళ్ళిపోతాడు.

ప్రభావతి మాటలకు సీరియస్ అయిన మీనా అక్కడ ఏమైనా జరగని కానీ ఈరోజు ఏంటి అనేది తెలుసు కదా ఈ మనిషికి మళ్లీ ఎందుకు అక్కడికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు ఎంత చెప్పినా మారవా? మీనా ను ఇంతగా ఏడిపిస్తావా? నువ్విక నాతో మాట్లాడల్సిన అవసరం లేదు అని సత్యం తేల్చి చెప్పేస్తాడు.. ప్రభావతి వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది ఇదే గొడవలు గనుక కంటిన్యూ అయితే వీళ్ళిద్దరూ విడిపోవడం ఖాయం అంటూ అనుకుంటుంది. అప్పుడే రోహిణి కూడా వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది ఆంటీ అదేంటో తెలుసుకోవాలని అంటుంది..


ఇక బాలు మీనా దగ్గరికి వెళ్తాడు. నిన్ను నేను ఏమి అనలేదు కదా ఏం జరిగినా వెళ్లి నువ్వు మా నాన్న దగ్గర చెప్తావా ఇప్పుడు మా నాన్న నాతో మాట్లాడనని చెప్పాడు దానికి కారణం నువ్వే కదూ అని మీనా పై సీరియస్ అవుతాడు. నీకు అసలు నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని నేను చెప్పట్లేదు. అంతే తప్ప నీ తమ్ముడిని కొట్టడానికి నాకేంటి సరదా కాదు.. చేతి దూల అంతకన్నా కాదు అని మీ నాతో అంటాడు.. నా తమ్ముని కొట్టారు ఇప్పుడు నన్ను కూడా కొట్టాలని వచ్చారా చంపేసేయండి ఒక పని అయిపోతుంది అంటూ మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. బాలు అది చూసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మీనా వంటగదిలోని సామాన్లన్నీ కిందేస్తుంది. అది విన్న ప్రభావతి ఇలాగే ఈ గొడవ కంటిన్యూ అయితే మీనా ఖచ్చితంగా పుట్టింటికి వెళ్తుంది ఆ పూల కొట్టును తీసి అవతలి పడేస్తానని మనసులో అనుకుంటుంది.

రవి దగ్గరికి శృతి వచ్చి ఉదయం అమ్మ డబ్బింగ్ స్టూడియో దగ్గరికి వచ్చింది తెలుసా అని అంటుంది. ఎందుకు వచ్చింది.. ఏదైనా పని మీద వచ్చిందా అని అడుగుతాడు రవి.. నన్ను చూడడానికి వచ్చింది అయితే మా అమ్మ నాకు కొన్ని కూపన్స్ ఇచ్చింది. మనము ఎక్కడికి వెళ్ళలేదు కదా పెళ్లయిన తర్వాత మొదటిసారి మనం బయటకు వెళ్లాలి అని నేను అనుకుంటున్నాను అని శృతి అంటుంది. కానీ రవి మాత్రం నాకు ఇప్పుడు రెస్టారెంట్లో చాలా పనులు ఉన్నాయి. సరే అండి ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది నాకు రావడం కుదరదు అని అంటాడు కానీ శృతి మాత్రం వినకుండా వాదన పెట్టుకుంటుంది.

ఇక బాలు ఈ ఆడవాళ్లు అస్సలు అర్థం కాదు ఎప్పుడు కట్టుకుంటారో ఎప్పుడు పడేస్తారో తెలియట్లేదు అంటూ పైకెళ్లి పడుకుంటారు. అప్పుడే మనోజ్ కూడా అక్కడికి వస్తారు. ఏంట్రా నీకేమైంది నువ్వేం చేసావ్ అని బాలు సెటైర్లు వేస్తాడు. అలాగే రవి కూడా పైకి వస్తాడు. ముగ్గురు కలిసి తమ భార్యల వల్ల బాధపడుతున్నామని కష్టాలను చెప్పుకుంటారు.. ఇక మీనా దగ్గరికి శృతి వచ్చి రవి చేసిన పని గురించి చెప్తుంది అలాగే రోహిణి కూడా వచ్చి మనోజ్ అన్న విషయాల గురించి బయటపడుతుంది. ముగ్గురు అక్క చెల్లెలు ఒక్కటైపోతారు. తమ భర్తల్ని ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలని అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో గదిలోకి వెళ్లిన బాలు ఫోన్లో శివ చేసిన దొంగతనం వీడియో చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ ఫోన్ ని పక్కన పెట్టి స్నానానికి వెళ్తాడు అయితే ఆ ఫోన్లో ఏం చూసాడు అబ్బా ఈయన ఇంత సీరియస్ అయ్యాడు అని మీనా పట్టుకుంటుంది. అందులో ఉన్న శివ దొంగతన వీడియో బయట పడుతుందా? లేదా చూడాలి.

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×