Vizianagaram District: విజయనగరం జిల్లాలో దారుణ విషాదం చోటుచేసుకుంది. విజయనగరం కంటోన్మెంట్ పరిధిలోని ద్వారపూడి గ్రామంలో కారు డోర్లు లాక్ అవ్వడంతో.. అందులో చిక్కుకున్న నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ రోజు మార్నిగ్ నలుగురు చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. చాలా సేపటికి కూడా తిరిగి పిల్లలు ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వారు ఎంత వెతికినా.. ఎక్కడా కనిపించలేదు. అయితే స్థానిక మహిళా మండలి కార్యాలయం వద్ద ఆగిఉన్న కారు డోర్స్ లాక్ అయ్యి ఉన్నాయి. అందులో నలుగురు చిన్న పిల్లల మృతదేహాలు ఉన్నట్టు స్థానికులు గుర్తించారు.
Also Read: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై ఇండియన్ ఆర్మీ మరో వీడియో రిలీజ్.. ఈసారి తగ్గేదేలే
సరదాగా ఆడుకునేందుకు కారు లోపలికి వెళ్లిన తర్వాత.. ఒక్కసారిగా కారు డోర్లు లాక్ పడ్డాయి. దీంతో చిన్నారులు ఊపిరి ఆడక మృతిచెందినట్టు తెలుస్తోంది. మృతిచెందిన చిన్నారులను ఉదయ్ (8), చారుమతి (8), చరిష్మా (6), మనస్విగా గుర్తించారు. వీరిలో చారుమతి, చరిష్మా అక్కాచెల్లెళ్లు అని స్థానికులు చెప్పారు. వెంటనే ఈ విషయాన్ని చిన్నారుల తల్లిదండ్రులకు చెప్పారు. చిన్నారులు మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా బోరున ఏడ్చారు.
Also Read: Terrorist Saifullah Khalid: మోస్ట్ డేంజర్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతం.. ఎట్ల చంపారంటే?
రాష్ట్రంలో మరో దారుణ విషాదం..
రాష్ట్రంలోనే మరో దారుణ విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేవరాజపురంలో విషాదం జరిగింది. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను శాలిని(5), అశ్విన్ (6), గౌతమి (8)గా పోలీసులు గుర్తించారు. ఇంటి పునాది కోసం తవ్విన గుంతలో భారీ వరద నీరు చేరుకుంది. అయితే ఈ ముగ్గురు చిన్నారులు ఆడుకుంటూ అటువైపు వెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఆ గుంతలో పడి మృతిచెందారు. చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.