Mexico Bus Accident: మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సులో మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో ఈ మంటలు చెలరేగాయి. మృతుల్లో 38 మంది ప్రయాణీకులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతదేహాలను గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం 18 మంది మృతదేహాలను మాత్రమే గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మెక్సికోలోని ఎస్కార్సెగా నగరానికి సమీపంలో.. శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు బస్సును ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని ప్రయాణికులు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 40 మంది సజీవదహనం కాగా.. మరికొంత మంది తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వారికి అత్యవసర సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పలువురు స్పందించారు.
ఈ ఘటనపై టాబాస్కోలోని కమల్ కాల్కో మేయర్ ఒవిడియో పెరాల్టా స్పందించారు. కాంకున్ నుంచి టబాస్కోకు వైపుగా వెళుతున్న బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సానుభుతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని, వారికి అవసరమైన సాయాన్ని అందిస్తామని తెలిపారు.
Also Read: ట్రంప్ తదుపరి టార్గెట్ ఇరాన్.. భారీ బాంబు దాడులకు ప్లాన్
కాగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సుస్పీడు లిమిట్‌లో లేదని కొందరు చెబుతున్నారు. అయితే బస్సు ఆపరేటర్ ఈ విషయంలో పూర్తి సహకారం అందిస్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అసలు ఈ ఘటన ఎలా జరిగింది.. డ్రైవర్లు అప్రమత్తం వల్ల జరిగిందా లేక ఇంకేమన్న కారణం ఉందా? అన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించనున్నట్లు వెల్లడించింది. ఈ ఘటనపై స్థానికి ప్రజలు తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా ద్వారా మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. అమెరికాలో అలస్కా విమానం గల్లంతు ఘటన విషాదాంతంగా ముగిసింది. గల్లంతైన విమానం కూలిపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. యునలక్లీట్ నుంచి అలస్కా మీదుగా నోమ్ వెళ్తున్న విమానం రాడర్ల నుంచి అదృశ్యమైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టగా.. సముద్రంలో భారీ మంచుఫలకంపై విమానం కూలిపోయి ఉండటాన్ని అధికారులు గుర్తించారు.
దక్షిణ మెక్సికోలో ఘోరం.. బస్సుకు నిప్పంటుకోవడంతో 40 మంది సజీవదహనం
ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం
బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 40 మంది మృతి
టబాస్కో రాష్ట్రంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం
మంటలు విస్తరించడంతో ప్రాణాలు… pic.twitter.com/6sXP8vtHve
— BIG TV Breaking News (@bigtvtelugu) February 9, 2025