Denied Leave Man Stabs Office Colleagues | పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి తనకు ఆఫీసులో సెలవు ఇవ్వలేదనే కోపంతో నలుగురి సహోద్యోగులను కత్తితో పొడిచేశాడు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోతుండగా.. ఒక వ్యక్తి అతడితో మాట్లాడాలని ప్రయత్నిస్తుండగా.. దెగ్గరికి వస్తే పొడిచేస్తానని బెదిరించాడు. ఈ ఘటనని మరో వ్యక్తి వీడియో రికార్డ చేయడంతో సోషల్ మీడియాలో ఆ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంల నార్త్ 24 పరాగనాస్ జిల్లాకు చెందిన అమిత్ కుమార్ సర్కార్ అనే 40 ఏళ్ల వ్యక్తి సోడేపూర్ ఘోలా ప్రాంతానికి చెందినవాడు. అతను పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని టెక్నికల్ ఎడుకేషన్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. కోల్ కతా న్యూ టౌన్ ప్రాంతంలోని కారిగరి భవన్ బిల్డింగ్ లో ఈ విభాగం ఉంది. గురువారం ఫిబ్రవరి 06, 2025న అమిత్ కుమార్ సర్కార్ తన ఆఫీసు నుంచి రెండు బ్యాగులు తీసుకొని ఒక దాన్నీ వీపుపై తగిలించుకొని, మరొక దాన్ని చేతిలో మోస్తూ త్వరగా త్వరగా వెళుతున్నాడు. అతని రెండో చేతిలో ఒక కత్తి ఉంది.
అది చూసిన ఇద్దరు వ్యక్తులు అమిత్ కుమార్ వద్దకు వెళ్లాలని ప్రయత్నించారు. కానీ అమిత్ కుమార్ ఆగ్రహంగా కనిపించాడు. తన దెగ్గరకు వస్తే కత్తితో పొడిచేస్తానంటూ భయపెడుతున్నాడు. ఇదంతా ఆ ఇద్దరిలో ఒకరు వీడియో రికార్డ్ చేశారు. నన్ను చులకనగా చూస్తారా?.. నేను అడిగితే సెలవు ఇవ్వరా?.. పైగా ఎగతాళి చేస్తారా? అని కోపంగా మాట్లాడుకుంటూ అమిత్ కుమార్ వెళుతుండగా… కాసేపట్లో అతడిని పోలీసులు అరెస్టు చేశారని తెలిసింది.
Also Read: కుక్కలతో ఆ పని చేసినందుకు దోషికి 475 ఏళ్ల జైలు.. ఎంత క్రూరంగా చేసేవాడంటే
పోలీసుల కథనం ప్రకారం.. అమిత్ కుమార్ సర్కార్ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. గత కొన్ని రోజులుగా అతను ఆఫీసులో సెలవు కోసం అనుమతి కోరాడు. కానీ ఆఫీసు ఉన్నతాధికారి అతనికి సెలవు అప్లికేషన్ కు నిరాకరించాడు. దీంతో కోపంగా ఉన్న అమిత్ కుమార్ ను అతని సహోద్యోగులు క్యాంటీన్ లో సరదాగా పలకరించారు. వారి మాటలు తనను ఎగతాళి చేసే విధంగా ఉన్నాయని భావించిన అవమానంగా ఫీలైన అమిత్ కుమార్ క్యాంటీన్ లోని కత్తి తీసుకొని ఆ నలుగురిపై దాడి చేశాడు.
ఈ ఘటనలో అమిత్ కుమార్ సహోద్యోగులైన జయదేబ్ చక్రబోర్తి, శాంతను సాహా, సార్థా లతె, షేఖ్ సతాబుల్ ని చికిత్స కోసం సమీప ఆస్పత్రిలోకి తరలించారు. ఈ నలుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే అమిత్ కుమార్ ఈ కారణాలతో సెలవు అడిగాడో, అతడి సెలవు అప్లికేషన్‌ని ఎందుకు నిరాకరించారో వివరాలు తెలియలేదు. అమిత్ కుమార్ ని అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుమార్ ఆఫీసులో ఇంకా విచారణ చేయాల్సి ఉందని అప్పుడే పూర్తి నిజం ఏంటో తెలుస్తుందని చెప్పారు.