Fatehpur robbery: వీధిలోకి వచ్చిన ఓ సాధారణ లైన్‌మెన్ లేదా మీటర్ చెక్ చేయడానికి వచ్చినవాడని అనుకున్నా… లోపలికి అడుగుపెట్టిన క్షణం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చేతిలో గన్‌లు, కళ్లల్లో బెదిరింపులు… కొద్ది నిమిషాల్లోనే ఇల్లు మొత్తం భయంకర వాతావరణంలో మునిగిపోయింది. ‘మీటర్ చెక్ చేస్తాం’ అన్న మాట నమ్మి తలుపు తీయడం ఆ కుటుంబానికి ఎంతటి దురదృష్టాన్ని తెచ్చిందో ఇప్పుడు అందరూ ఇదే చర్చించుకుంటున్నారు.
ఫతేహ్‌పూర్‌లో దారుణం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేహ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సాధారణంగా విద్యుత్ డిపార్ట్‌మెంట్ వారు మీటర్ చెక్ చేయడానికి వస్తుంటారు. అలాంటి వారేనని భావించి ఓ కుటుంబం తలుపు తెరిచింది. కానీ వారు అసలు లైన్‌మెన్‌లు కాదు, మీటర్ పరిశీలకులు కాదు… దుండగులు. ఇంట్లోకి అడుగుపెట్టగానే తుపాకులు ఎత్తి చూపించి కుటుంబ సభ్యులను భయపెట్టారు.
తుపాకీ భయంతో వణికిన కుటుంబం
ఇంట్లో పెద్దవాళ్లు, మహిళలు, పిల్లలు.. అందరూ ఆ దుండగుల గన్ పాయింట్ కిందకు వెళ్లిపోయారు. ఎవరైనా కదిలితే కాలుస్తామని హెచ్చరించారు. ఆందోళనలో ఎవరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఈలోపు దుండగులు విలువైన బంగారు నగలు, నగదు కోసం ఇంటిని చీల్చి చూశారు. కొన్ని నిమిషాల్లోనే లక్షల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
వృద్ధురాలిపై దాడి.. కాల్పులు
ఈ క్రమంలో కుటుంబంలోని ఒక వృద్ధురాలు ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు. వారి దుర్మార్గం చూసి ఆమె చుట్టుపక్కల వారిని కేకలు వేసి పిలవాలని చూశారు. అదే సమయంలో దుండగులు ఆమెపై తుపాకీ కాల్పు జరిపారు. బుల్లెట్ ఆమె కాలి లోపలికి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆమె రక్తసిక్తంగా కుప్పకూలగా, ఇంట్లో మరింత భయాందోళన నెలకొంది.
భయాందోళన
గొడవ విన్న స్థానికులు చేరుకునేలోపే దుండగులు అక్కడినుంచి తప్పించుకున్నారు. గాయపడిన వృద్ధురాలిని కుటుంబ సభ్యులు తొందరగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఫతేహ్‌పూర్ జిల్లా మొత్తం భయాందోళనకు గురైంది. “మీటర్ చెక్ చేస్తాం” అని చెప్పి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుల పద్ధతి చూసి ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
Also Read: NHAI FASTag passes: 4 రోజుల్లోనే 150 కోట్ల వసూళ్లు.. ఫాస్ట్ ట్యాగ్ కు ఆదాయం అదుర్స్.. ఎందుకిలా?
పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కేసు నమోదు చేసి నిందితులను వెతికే పనిలో ఉన్నారని తెలిపారు. దొంగల ముసుగులో వచ్చిన గ్యాంగ్ గా పోలీసులు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, స్థానికుల వివరాల ఆధారంగా నిందితుల జాడ కోసం శ్రమిస్తున్నారు.
ప్రజల్లో ఆందోళన
ఇక ఇలాంటి సంఘటనతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిజంగా మీటర్ చెక్ చేసేందుకే వచ్చినవారా? లేక ఎలాంటి ధృవీకరణ లేకుండా తలుపులు తెరిస్తే ఏం జరుగుతుందో ఈ ఘటన బాగా చాటి చెబుతోంది. “తలుపు తీయడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు.
ఇంటి భద్రతపై మళ్ళీ చర్చ
ఈ సంఘటనతో “ఇంటి భద్రత”పై మళ్ళీ చర్చ మొదలైంది. ఇంట్లో సీసీటీవీలు, భద్రతా అలారమ్‌లు ఉండటం ఎంత అవసరమో ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. పక్కింటి వాళ్లే అయినా కచ్చితంగా గుర్తు పట్టి చూసే అలవాటు ఉండాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఒక చిన్న తప్పు – మీటర్ చెక్ చేయడానికి వచ్చాం అని నమ్మి తలుపు తెరవడం, ఆ కుటుంబానికి భయంకరమైన అనుభవాన్ని తెచ్చింది. దుండగులు పారిపోయినా, ఇంటి సభ్యులు ఇప్పటికీ షాక్‌లో ఉన్నారు. వృద్ధురాలు గాయాలతో బాధపడుతున్నారు. ఎంత సింపుల్ కారణమైనా, ఎవరినైనా ఇంట్లోకి అనుమతించే ముందు జాగ్రత్త తప్పనిసరి!
https://x.com/SachinGuptaUP/status/1957777288512348258