Private Travels Bus Incident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రక్కును కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఎనిమంది మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: కారును ఢీకొన్న ట్రావెల్ బస్సు.. సజీవదహనమైన తల్లి, కుమారుడు
రోడ్డు ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, ఇతర వాహనాదారులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతోంది.. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు సమీపంలో జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు బోల్తా పడింది. విశాఖపట్నం నుంచి గుంటూరు వెళుతున్న బస్సు అదుపు తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నారు. ఏలూరు రూరల్ పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. తెల్లవారుజాము సమయంలో బస్సు బోల్తా కొట్టింది. గాయపడ్డ వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితమే ఇదే ప్రాంతంలో ఒక ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైన నలుగురు చనిపోయారు.