BigTV English

Warangal Congress: కొండా కొట్లాట! తగ్గేదెవరు.. నెగ్గేదెవరు?

Warangal Congress: కొండా కొట్లాట! తగ్గేదెవరు.. నెగ్గేదెవరు?

Warangal Congress: కాకతీయుల గడ్డపై కాంగ్రెస్ వర్గపోరుకు బ్రేక్ పడేదెప్పుడు..? పైకి సద్దుమణిగినట్లే కన్పిస్తున్నా పరిశీలించి చూస్తే మాత్రం పరిస్థితి మరింత తీవ్రమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట. రెండు వైపులా నేతలు ఎవరికి వారు తగ్గేదేలె అంటుండడంతో రాబోయే రోజుల్లో ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని గుబులు పడుతున్నారట హస్తం నేతలు.


హస్తంలో కాకరేపుతున్న ఉమ్మడి వరంగల్ జిల్లా పాలిటిక్స్

ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ చైతన్యానికి కేరాఫ్‌గా నిలుస్తుంటుంది. ఇలాంటి చోట కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందరో హేమాహేమీల్లాంటి నేతలు ప్రాతినిథ్యం వహించారు. రాష్ట్ర స్థాయలో తమదైన పాత్ర పోషించడమే కాదు.. హవా నడిపించారు. పార్టీలో కీలక నేతలుగా ఎదిగారు. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఈ జిల్లాలో.. ఇప్పుడు హస్తం రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. సొంత పార్టీలోని నేతల మధ్య ఆధిపత్య పోరులో ఎవరిది పైచేయి అవుతుంది.. ఎవరి మాట నెగ్గుతుంది.. ఎవరు తగ్గుతారు అన్నది ఆసక్తినే కాదు అంతకు మించిన ఉత్కంఠను రేపుతోంది.


సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కొండా మురళి హాట్ కామెంట్స్

కొండా మురళి వర్సెస్ జిల్లా కాంగ్రెస్‌కు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు అన్నట్లుగా పరిస్థితి తయారు కావడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే.. ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఓసారి పరిశీలిస్తే..ఈ నెల 19న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు కొండా మురళి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ సమయంలో ఆయన చేసిన కామెంట్లే కాక పుట్టించాయి. జిల్లా కాంగ్రెస్‌లో విభేదాలకు కారణమయ్యాయి.

కొండా మురళి కామెంట్లపై భగ్గుమన్న ఎమ్మెల్యేలు

కార్యకర్తలు, పార్టీ నాయకుల మధ్య.. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, కడియం శ్రీహరిపై విరుచుకుపడ్డారు కొండా మురళి. ఈ కామెంట్లపై జిల్లా కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నేతృత్వంలో భేటీ అయ్యారు. వర్థన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ డీసీసీ ఎర్రబెల్లి స్వర్ణ కలిసి కొండా మురళి కామెంట్ల విషయంలో ఏం చేయాలన్న దానిపై చర్చించారు. చివరకు మూకుమ్మడిగా పార్టీ అధిష్టానానికి కొండా మురళి ఎపిసోడ్‌పై కంప్లైంట్ చేశారు. గత కొంత కాలంగా మురళి.. సొంత పార్టీ నేతల్నే టార్గెట్ చేస్తున్నారని.. ఆయన తీరు వల్ల పార్టీ గ్రాఫ్ పడిపోతోందని అభిప్రాయపడ్డారు. పార్టీకి నష్టం చేస్తున్న కొండా మురళి కుటుంబంపై బహిష్కరణ వేటు వేయాలంటూ ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యేలు.

క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొండా మురళి

కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి వరంగల్‌లో తలెత్తిన విభేదాలపై హైకమాండ్ వెంటనే ఫోకస్ పెట్టింది. జిల్లా నేతల మధ్య నెలకొన్న పంచాయితీకి పుల్ స్టాప్ పెట్టాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీని ఆదేశించారు. క్రమశిక్షణ కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో.. ఏం జరగబోతోందన్న ఉత్కంఠతతో ఎదురు చూశారు జిల్లా కాంగ్రెస్ నేతలు. ఈ క్రమంలోనే మల్లు రవి ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు కొండా మురళి.

వివరణ ఇచ్చేందుకు బదులుగా రివర్స్‌లో కంప్లైంట్

కానీ, అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి అన్న తీరులో మల్లు రవి ఆధ్వర్యంలోని క్రమశిక్షణా కమిటీ ముందు హాజరైన కొండా మురళి.. జరిగిన అంశంపై వివరణ ఇవ్వడం కంటే.. మరికొందరు నేతలపై ఫిర్యాదు చేశారన్న వాదన బలంగా విన్పిస్తోంది. ప్రధానంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డిపై కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా సద్దుమణుగుతుందని అంతా భావించిన పంచాయతీ కాస్తా మరింత ముదిరిందన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావడం, వివరణ ఇస్తారనుకుంటే మళ్లీ రివర్స్‌లో కంప్లైంట్ చేయడంపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు హస్తం ఎమ్మెల్యేలు సీరియస్‌గా ఉన్నారట. అసలు మురళి నుంచి వివరణ తీసుకోకుండా.. రివర్స్‌లో కంప్లైంట్ ఎలా తీసుకున్నారని లోలోన రగిలిపోతున్నారట. ఇదే అంశంపై చర్చించేందుకు తాజాగా మరోసారి వీరంతా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కొండా మురళి అంటే భయమేస్తోందని అందుకే ఫిర్యాదును లైట్ తీసుకున్నారని సెటైర్లు

అసలు ఈ మొత్తం వ్యవహారంలో సొంత పార్టీ నేతలపై లేనిపోని విమర్శలు చేసిన కొండా మురళిపై.. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి అయితే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట. కొండా మురళి అంటే భయమేస్తోందని అందుకే ఫిర్యాదును లైట్ తీసుకున్నారని సెటైర్లు వేస్తున్నారట రాజేందర్ రెడ్డి. కొండా ఫ్యామిలీ బీసీ కార్డు అడ్డం పెట్టుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని లేదంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆఫ్ ద రికార్డ్‌గా చెబుతున్నారట మరికొందరు కొందరు హస్తం ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలు, కొండా ఫ్యామిలీ మధ్య నెలకొన్న పంచాయతీ పక్కన పెడితే.. ఇప్పటికే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య వార్ గట్టిగానే నడుస్తోందట. ఇటీవలె భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం విషయంలో జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శననం అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇలాంటి వేళ.. లేటెస్ట్ పంచాయతీ వ్యవహారంతో నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైందట పరిస్థితి.

Also Read: ఈ స్టాంపుల కుంభకోణం! అసలేం జరిగింది..?

పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. హస్తిన హైకమాండ్‌కు ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారన్న టాక్ విన్పిస్తోంది. అయితే.. కొండా మురళి సైతం తమ బలం ఏంటో అందరికీ తెలుసని.. తనను రెచ్చగొట్టొద్దని కామెంట్లు చేయడం ఈ ఎపిసోడ్‌ను మరింత వేడెక్కిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ వర్గ పోరుకు పుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది అని సగటు కార్యకర్త ఆలోచిస్తున్నాడట.

Story By rajshekar, Bigtv

Related News

Palakurthi Politics: ఎర్రబెల్లి యూ టర్న్.. యశస్విని రెడ్డికి షాక్ తప్పదా?

Kadapa MLA: కడప రెడ్డమ్మ కథ రివర్స్..?

BJP Vs BRS: కేసీఆర్‌కు బీజేపీ షాక్! వెనుక స్కెచ్ ఇదే!

Urea War: బ్లాక్ మార్కెట్‌కు యూరియా తరలింపు.? కేంద్రం చెప్పిందెంత..? ఇచ్చిందెంత..?

AP Politics: సామినేని అంతర్మథనం..

Satyavedu Politics: మారిన ఆదిమూలం స్వరం.. భయమా? మార్పా?

Big Stories

×