E-Paper
Advertisement

Crime News: సైడ్ బిజినెస్‌ కోసం.. టీ స్టాల్‌లో గంజాయి దందా..!

Crime News: సైడ్ బిజినెస్‌ కోసం.. టీ స్టాల్‌లో గంజాయి దందా..!
Advertisement

Crime News: టీ స్టాల్‌లో పని చేస్తున్న ఓ వ్యక్తి సైడ్ దందాగా గంజాయి అమ్ముతుండగా సమాచారం తెలుసుకున్న ఎక్సయిజ్​ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్‌లోని పోస్టాఫీస్​ ఎదురుగా ఉన్న టీ స్టాల్ లో నారాయణ్​ ఖేడ్​ కు చెందిన ఉద్యానాథ్ పని చేస్తున్నాడు. అయితే, ఆశించినంత జీతం రాకపోతుడటంతో ఉద్యానాథ్ కొంతకాలంగా గంజాయి విక్రయించటం మొదలు పెట్టాడు. బీదర్ నుంచి గంజాయి తెప్పించుకుంటూ చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఒక్కోదానిని 500 రూపాయలకు విక్రయిస్తున్నాడు.

స్కూటీ డిక్కీలో ప్యాకెట్లు..

యజమానికి విషయం తెలియ వద్దని తన స్కూటీ డిక్కీలో ప్యాకెట్లు దాచిపెట్టి దందా చేస్తున్నాడు. ఈ మేరకు పక్కాగా సమాచారాన్ని సేకరించిన రంగారెడ్డి జిల్లా ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్​ సీఐ సుభాష్​ చందర్​, ఎస్​ఐ అఖిల్ తోపాటు సిబ్బందితో కలిసి దాడి చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు. అతని నుంచి 730 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి నిందితున్ని తదుపరి దర్యాప్తు నిమిత్తం ఉప్పల్​ ఎక్సయిజ్ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Also Read: Craving Sugar: చక్కెర మానేయాలా ? తీపి కోరికను తీర్చే.. 5 ఆరోగ్యకరమైన మార్గాలు

కాప్రాలో..

కాప్రాలో గంజాయి అమ్ముతున్న నలుగురిని ఎస్టీఎఫ్​ బీ టీం ఎస్​ఐలు నాగరాజు, జ్యోతి సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. నిందితుల నుంచి 365గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంద రాహుల్​, విశ్వనాథ్​, మనోజ్​, తనీష్​‌లు కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారు. రాహుల్ మహారాష్ట్ర నుంచి గంజాయి తెప్పించుకుంటూ విక్రయిస్తుండగా మిగితా ముగ్గురు ధూల్ పేట నుంచి గంజాయి కొని తెచ్చుకుంటూ అమ్ముతున్నారు. పక్కాగా అందిన సమాచారం మేరకు వీరిని అరెస్ట్ చేసిన ఎస్టీఎఫ్​ అధికారులు రాహుల నుంచి 131 గ్రాములు, మిగితా ముగ్గురి నుంచి 234 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. దాంతోపాటు మూడు బైక్​ లు, మూడు సెల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు. నలుగురిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం కాప్రా ఎక్సయిజ్ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Also Read: Naga Chaitanya: వైరల్ అవుతున్న శోభిత, నాగ చైతన్య రొమాంటిక్ వీడియో.. ఎంత క్యూట్ జంట రా బాబు..!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×