Crime News: స్వేచ్ఛ బ్యూరో: ఉప్పల్‌లోని నాచారం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలపై పోలీసులు దాడులు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు పహారా ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధారావత్ సంతోష్, సందీప్ అనే ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి సుమారు 1 కిలో 200 గ్రాముల ఎండు గంజాయి, ఒక హోండా యాక్టివా ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ ప్రాంతం నుంచి గంజాయిని తక్కువ ధరలకు కొనుగోలు చేసి, మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో అవసరమైన వారికి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.
Also Read: మీరు ఏం తింటున్నారన్నది కాదు.. ఎలా తింటున్నారన్నదే ముఖ్యం!
ముఖ్యంగా విద్యార్థులు, పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని అమ్మకాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సమాచారంతో ముందుగానే రూట్ వాచ్ నిర్వహించిన ఎక్సైజ్ సిబ్బంది నిందితులను పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా నాచారం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ అధికారులు ప్రెస్ నోట్ విడుదల చేసి వివరాలు వెల్లడించారు.
Also Read: అగ్నిగుండంగా మారుతున్న తెలంగాణ.. రికార్డు స్థాయిలో పెరిగిన ఉష్ణోగ్రతలు!