Shahid Afridi On Mohsin Naqvi: ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ( Women’s Asia Cup 2026 ) తుది అంకానికి చేరుకుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా ఉమెన్స్ వర్సెస్ శ్రీలంక ( IND VS SL Womens) మధ్య ఫైనల్స్ ఆదివారం రోజున జరగనుంది. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. నిన్న శ్రీలంకతో జరిగిన రెండో సెమీ ఫైనల్స్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలోనే టీమిండియాతో ఫైనల్స్ ఆడే అవకాశాన్ని పాకిస్తాన్ ఉమెన్స్ టీం కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్తాన్ ఫైనల్స్ కు రాలేదన్న కోపంతో ఆ దేశ మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. ఫైనల్స్ లో టీమిండియాను ఓడించాల్సిందేనని శ్రీలంక క్రికెటర్లను కోరుతున్నారు. తాము గెలవకపోయినా సరే… టీమిండియా ఉమెన్స్ టీం మాత్రం ఛాంపియన్ కాకూడదని సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా పెడుతున్నారు.
ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ( Women’s Asia Cup 2026 Finals) ఫైనల్స్ ఆదివారం రోజున జరగనుంది. టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య ఫైనల్స్ ఉండ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది హాట్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ ఫైనల్స్ చేరని నేపథ్యంలో… శ్రీలంక విజయం సాధించాలని ఆయన పేర్కొన్నారు. ఫైనల్స్ లో టీం ఇండియాను చిత్తుగా ఓడించాలని ఆయన శ్రీలంక క్రికెటర్లను కోరారు. పాకిస్తాన్ కోసం అయినా టీం ఇండియాను ఓడించాలని పిలుపునిచ్చారు. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి పాకిస్తాన్ అభిమానులు అందరూ చేరుకొని.. శ్రీలంకకు సపోర్ట్ చేయాలని కూడా సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్ మహిళల జట్టు చివరి వరకు పోరాడి… ఫైనల్స్ కు చేరే లేకపోవడం చాలా బాధాకరమన్నారు. అయినప్పటికీ శ్రీలంక కోసం పాకిస్తాన్ అభిమానులు అందరూ అల్లాను ప్రార్థించాలని దిశా నిర్దేశం చేశారు.
ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో ( Women’s Asia Cup 2026 ) ఒకవేళ టీమిండియా గెలిస్తే మాత్రం మొహ్సిన్ నఖ్వీ అలర్ట్ గా ఉండాలని షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025 పురుషుల ఆసియా కప్ సమయంలో ట్రోఫీని దొంగిలించినట్లుగానే… రేపటి టోర్నమెంట్ లో కూడా అదే పని చేయాలని సూచనలు చేశారు. శ్రీలంక గెలిస్తే వాళ్లకు ట్రోఫీ అందించాలన్నారు. అలా కాకుండా టీమిండియా ఫైనల్స్ గెలిస్తే మాత్రం… ట్రోఫీ కనిపించకుండా చేయాలని మొహ్సిన్ నఖ్వీకి (Mohsin Naqvi) సలహాలు ఇచ్చి కుట్రలకు తెర లేపారు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi).