E-Paper
Advertisement

పోలీస్ పిల్లల చదువుపై నో టెన్షన్.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన నిర్ణయం!

పోలీస్ పిల్లల చదువుపై నో టెన్షన్.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన నిర్ణయం!
Advertisement

C.V. Anand: స్వేచ్ఛ బ్యూరో:  సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం పోలీస్ సంక్షేమంలో కీలక భాగమని డీజీపీ సీ.వీ.ఆనంద్‌ అన్నారు. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన లేకుండా చేస్తే పోలీసులు విధులపై మరింత దృష్టి సారించగలరని పేర్కొన్నారు. మంచిరేవులలోని ఆక్టోపస్‌–గ్రేహౌండ్స్‌ ప్రాంగణంలో యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ అకడమిక్‌ బ్లాక్‌–1 నిర్మాణానికి శనివారం ఆయన భూమిపూజ చేశారు. 2024 డిసెంబరులో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు డీజీపీ తెలిపారు. ఆర్మీ, సైనిక్‌ స్కూళ్ల తరహాలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా పోలీస్ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది ఏప్రిల్‌లో తాత్కాలిక ప్రాంగణంలో 120 మంది విద్యార్థులతో పాఠశాల ప్రారంభమైందని, ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య సుమారు 360కు చేరిందన్నారు. కొత్త భవనం పూర్తయితే వచ్చే ఏడాది 700–720 మందికి చేరే అవకాశం ఉందని తెలిపారు.

విద్యతోపాటు క్రీడలు.. క్రమశిక్షణ..

Advertisement

విద్యార్థుల్లో విద్య, క్రమశిక్షణతోపాటు క్రీడలు, సహపాఠ్య కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. మాదకద్రవ్యాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు. విద్య కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా బాధ్యతాయుత పౌరులుగా ఎదిగేలా దోహదపడాలని ఆకాంక్షించారు. క్రికెట్‌తో పాటు రాక్‌ క్లైంబింగ్‌, గుర్రపు స్వారీ వంటి సాహస క్రీడల్లోనూ శిక్షణ అందిస్తామని తెలిపారు.

హోంగార్డుల పిల్లలు,సాధారణ విద్యార్థులకు కూడా అవకాశం..

Advertisement

పోలీసు సిబ్బందితోపాటు ఇతర వర్గాల పిల్లలకు కూడా అందుబాటులో ఉండేలా తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య అందించనున్నట్లు డీజీపీ తెలిపారు. హోంగార్డుల పిల్లలకు కూడా ప్రవేశాల్లో అవకాశం కల్పిస్తున్నామన్నారు. పాఠశాలలో 50 శాతం సీట్లు సాధారణ విద్యార్థులకు కేటాయించనున్నట్లు వెల్లడించారు.

ఒకే ప్రాంగణంలో ప్లస్‌–2 వరకు విద్య..

పాఠశాల అభివృద్ధికి అకడమిక్‌ తదితర అంశాలపై పలు సబ్‌ కమిటీలను ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. ప్రభుత్వ సహకారంతో ఒకే ప్రాంగణంలో ప్లస్‌–2 వరకు విద్య అందించే పూర్తిస్థాయి పాఠశాలగా యంగ్ ఇండియా పోలీస్ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. రానున్న రెండు, మూడేళ్లలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. నిర్మాణ, అభివృద్ధి పనులను సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

పోలీసుల సంక్షేమమే సమర్థ పోలీసింగ్‌ కు పునాది..

పోలీసు సిబ్బంది సంక్షేమం, ఆరోగ్యం సమర్థవంతమైన పోలీసింగ్‌ తో ముడిపడి ఉన్నాయని డీజీపీ అన్నారు. తమ పిల్లల చదువుపై భరోసా కల్పిస్తే పోలీసులు విధులపై మరింత ఏకాగ్రతతో పనిచేయగలరని పేర్కొన్నారు.

కార్యక్రమంలో డీజీ (లా అండ్‌ ఆర్డర్‌) మహేశ్‌ భగవత్‌, డీజీ (ఆక్టోపస్‌) అనిల్‌కుమార్‌, సైబరాబాద్‌ సీపీ డాక్టర్ రమేష్‌ రెడ్డి, ఐజీ (పి&ఎల్‌) గజరావు భూపాల్‌, ఏఐజీ రమణకుమార్‌, లీగల్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ శరత్‌కుమార్‌, డీసీపీ శ్రీనివాస్‌, అదనపు ఎస్పీ ఉదయ్‌రెడ్డి, ఏసీపీలు, వివిధ సంస్థల ప్రతినిధులు, స్కూల్ ప్రిన్సిపాల్‌ డాక్టర్ అనితారెడ్డి, జీఎం రాజేష్‌, పోలీసు అధికారులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.ః

Also Read: హరీశ్ రావుపై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా?: కవిత

Tags

Related News

గద్వాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు..!

గణేష్ మండపం పెడుతున్నారా? అయితే ఈ ఆన్‌లైన్ రూల్ తప్పనిసరి!

సూర్యపేట జిల్లాలో తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు!

హరీశ్ రావుపై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా?: కవిత

22A భూముల బాధితులకు గుడ్ న్యూస్.. పరిష్కారంపై మంత్రి పొంగులేటి క్లారిటీ!

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. సెప్టెంబర్ 14 నుంచి ఈ దారుల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

‘దసరాకి రికార్డింగ్ డ్యాన్సులకి పొండి’.. BRS ఎమ్మెల్యేలకు ఎంపీ చామల స్ట్రాంగ్ కౌంటర్!

Big Stories

Advertisement
×