E-Paper
Advertisement

ఢిల్లీలో విషాదం.. బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న కోర్టు జడ్జి

ఢిల్లీలో విషాదం.. బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న కోర్టు జడ్జి
Advertisement

Delhi Judge Aman Kumar Sharma: దేశ రాజధాని ఢిల్లీలో ఒక సిట్టింగ్ న్యాయమూర్తి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. ఢిల్లీలోని నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టులో జ్యుడీషియల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న అమన్ కుమార్ శర్మ శనివారం మధ్యాహ్నం తన నివాసంలో ప్రాణాలు తీసుకున్నారు. సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్ ప్రాంతంలోని ఆయన నివాసంలో ఈ విషాద ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు.

పోలీసులు వెల్ల‌డించిన‌ సమాచారం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం సుమారు 1:45 నిమిషాల సమయంలో అమన్ కుమార్ శర్మ తన ఇంటి బాత్రూంలో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించారు. సమాచారం అందుకున్న వెంటనే సీనియర్ పోలీస్ అధికారులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలను సేకరించాయి. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

అమన్ కుమార్ శర్మ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలంలో ఎటువంటి ఆత్మహత్య లేఖ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. వృత్తిపరమైన ఒత్తిడి ఏమైనా ఉందా? లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక జ్యుడీషియల్ ఆఫీసర్ స్థాయి వ్యక్తి ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడంపై న్యాయవర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుతం పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి ఆయన కాల్ డేటా, గత కొద్దిరోజులుగా ఆయన ప్రవర్తనపై కుటుంబ సభ్యులను ఆరా తీస్తున్నారు. ఢిల్లీ వంటి కీలక నగరంలో ఒక జడ్జి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Read Also: డొమెస్టిక్ కంటే కమర్షియల్ ధరల పెంపు ప్రమాదకరం: ఎంపీ మల్లు రవి

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×