E-Paper
Advertisement

కేటీఆర్ హోం మంత్రిని చేస్తానంటుంటే..! నేనెందుకు పోతా కాంగ్రెస్‌లోకి..!

కేటీఆర్ హోం మంత్రిని చేస్తానంటుంటే..! నేనెందుకు పోతా కాంగ్రెస్‌లోకి..!
Advertisement

ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్ ఇవాళ ఓ కొత్త మాట చెప్పాడు. త‌న‌ను రేవంత్ కాంగ్రెస్‌లోకి ర‌మ్మ‌ని ఆహ్వానించాడ‌ట‌. కాంగ్రెస్‌లోకి వ‌స్తే.. టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తార‌న‌న్నార‌ట‌. అయినా విన‌క‌పోతే.. ప్లానింగ్ బోర్డ వైస్ చైర్మ‌న్ ప‌ద‌వి కూడా ఇస్తాన‌న్నాడ‌ట‌. అయినా స‌రేమిరా అన్నాడ‌ట ప్ర‌వీణ్‌. ఇక్క‌డ పార్టీ మార‌డం, ప‌ద‌వుల అంశం వ‌చ్చింది కాబ‌ట్టి.. సంద‌ర్భోచితంగా ఓ చ‌ర్చ కూడా వస్తోంది.

బీఎస్పీలో ఉన్న‌ప్పుడు కేసీఆర్‌ను తిట్ట‌ని తిట్టు లేదు. కేటీఆర్‌ను కూడా బాగానే అర్సుకున్నాడు. అప్ప‌టి దాకా ఆరెస్ ప్ర‌వీణ్‌పై జ‌నాల‌కు కూడా మంచి ఓపీనియ‌నే ఉంది. తను పోటీ చేసిన చోటా గెల‌వ‌లేదు.. అది వేరే విష‌యం! ఓడిపోయినంత మాత్రాన ఆయ‌న ప‌ట్ల ఉన్న అభిప్రాయం మార‌దు. మార‌లేదు.

Advertisement

కానీ ఇంత తిట్టి..మ‌ళ్లీ బీఆరెస్ పంచ‌న చేర‌డ‌మే అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అయినా ఇదేదో స్ట్రాట‌జీ అయి ఉంటుందిలే అనుకున్నారు. బ‌హుశా.. డిప్యూటీ సీఎం ఇస్తాన‌ని ఆఫ‌ర్ ఇచ్చి ఉంటార‌ని కూడా కొంత మంది చ‌ర్చించుకున్నారు. ఆరో వేలులా డిప్యూటీ సీఎంలు ఇద్ద‌రికి, ముగ్గురికి ఇచ్చినా ఇస్తాడు కేసీఆర్. కానీ త‌రువాత కాలంలో కేటీఆర్ మాట‌ల‌ను బ‌ట్టి, ఆరెస్ ప్ర‌వీణ్ చేత‌ల బ‌ట్టి తెలిసొచ్చిందేమిటంటే.. ఆయ‌న‌కు బీఆరెస్ ప్ర‌భుత్వంలో హోం మంత్రిని ఇస్తార‌ని.  దానికి క‌మిట్ అయి ఆయ‌న వ‌చ్చాడ‌ని.

మ‌రి రేవంత్ ఇలా చిన్న చిన్న ప‌ద‌వులు ఇస్తాన‌న‌డం త‌న‌ను చిన్న‌బుచ్చ‌డ‌మే అవుతుంది. పోలీస్ కాబట్టి..ఆ శాఖ‌కు అత్యున్న‌త బాస్ కావాలనేదే పెద్ద కోరిక‌.. మ‌రి ఏకంగా హోం శాఖ‌కే మంత్రి అయితే.. ఆ క‌ల నేర‌వేరాలంటే మామూలు విష‌యం కాదు. కేసీఆర్‌తో అది సాధ్య‌ప‌డుతుంద‌ని బ‌లంగా న‌మ్మాడు ఆరెస్ ప్ర‌వీణ్ కుమార్‌. కానీ ఆయ‌న‌ త‌న హుందాత‌నం వీడి చేసే కొన్ని ఆరోపణ‌లు, మాట‌లు.. జనాల వ‌ద్ద ప‌లుచ‌నే చేశాయి.

Advertisement

మ‌రి ఇలా చేయ‌మ‌ని కేటీఆర్ చెబుతున్నాడా? బాస్‌ల‌తో మెప్పు పొందేందుకు ఈయ‌నే కొంచెం అతి చేస్తున్నాడా? తెలియ‌దు. మొత్తానికి ముందే కేటీఆర్ పంచిన శాఖ‌ల్లో హోంమంత్రి శాఖ మాత్రం ఆరెస్ ప్ర‌వీణ్‌కు రిజ‌ర్వ్ అయిపోయింది. ఇక ఈ రెండేళ్ల కాలం ఎప్పుడు గ‌డుస్తుందా అని ఎదురుచూడ‌ట‌మే మిగిలుంది. అప్ప‌టి వ‌ర‌కు ఇలా ప్రెస్‌మీట్లు పెట్టుకుంటూ తిట్టుకుంటూ.. దుమ్మెత్తిపోసుకుంటూ.. బుర‌ద జ‌ల్లుకుంటూ ఉంటూ ఉంటాడు.

కానీ ఆ సెక్యూరిటీ త‌గ్గించ‌డం, గ‌న్‌మెన్ల‌ను వెన‌క్కి తీసుకోవ‌డం స‌ర్కార్ చేయాల్సిన చ‌ర్య కాదు. ఆయ‌న మానాన ఆయ‌న ఏదో చేసుకుంటున్నాడు. మ‌రీ వెంట‌ప‌డి.. క‌క్ష‌గ‌ట్టిన ఈ మార్పులెందుకు?

స‌రే, ఇవాళ కేటీఆర్ ఇంకో కొత్త ముచ్చ‌ట చెప్పిండు. మ‌హేశ్వ‌రం మీటింగుకు బ‌య‌లుదేరేట‌ప్పుడు.. కారులో కూర్చునే ప‌గ‌టిక‌ల ఒక‌టి క‌న్నాడంట‌. ఏమ‌ని? మ‌ళ్లీ కేసీఆర్ సీఎం అయిన‌ట్టు.. బీఆరెస్ అధికారంలోకి వ‌చ్చిన‌ట్టు.. ! ఆయ‌న టీం అంతా గెలిచిన సంబురాల్లో ఉన్న‌ట్టు.. ఇలా అనిపించిందంట‌. ఆయ‌నే స్వ‌యంగా వేదిక మీద చెప్పాడు. కాక‌పోతే దాన్ని ప‌గ‌టిక‌ల అనలేదు. కానీ అది ప‌గ‌టిక‌లే క‌దా. మ‌రి మ‌న ప్ర‌వీణ్ కూడా హోం మినిష్ట‌ర్ కావ‌డం ఆ ప‌గ‌టిక‌ల‌లో భాగంగానే ఉండి ఉంటుంది.

Related News

హౌసింగ్ స్కీం అట్ట‌ర్ ఫ్లాప్‌.. డబుల్ బెడ్ రూం ఇండ్ల‌పై ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మేలు!

ప్రకాష్ రాజ్‌కు 4 ఓట్లు? ఇప్పుడు ఒక్క ఓటు కూడా లేదా? అసలు.. SIR ఫారం ఇచ్చారా?

ధ‌ర్నాచౌక్‌లో బంధీయైన‌ స్వేచ్ఛ‌..! ఖుల్లం ఖుల్లాగా అల్లం మాట‌లు.. అప్పుడు మాట్లాడ‌లేక‌పోయాం..!

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీల‌కూ జెన్‌జీ భ‌యం! ఎవ‌రికి ప‌ట్టంగ‌డ్తారు? ఆ మూడు పార్టీల్లో టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌!

మోడీ పొర‌పాటు.. ఆర్ఎస్ఎస్ దిద్దుబాటు! జెన్‌జీని మ‌చ్చిక చేసుకునే ప‌నిలో బీజేపీ.. పీచేముడ్‌!

నిను వీడ‌ని బొద్దింక‌లు మేమే! చీఫ్ జ‌స్టిస్ చీఫ్ గెస్ట్‌గా మాకొద్దు.. న‌ల్సార్ వ‌ర్సిటీ విద్యార్థుల లేఖ దుమారం!

ఈట‌ల కోసం రేష‌న్ కార్డుల ముద్రణ‌ ఆపేసిన కేసీఆర్‌.. ఆ క‌థా క‌మామీషు ఎట్టిద‌నినా..!

ఇద్ద‌రూ దోస్తులే.. మ‌రి బెడిసికొట్టిందెక్క‌డ‌..? ఇక ఆయ‌న‌ను న‌మ్మ‌డ‌మూ క‌ష్ట‌మేనా..?

Big Stories

Advertisement
×