Kulu Accident: హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కులులో కొండ చరియలు విరిగి పడి ఆరుగురు మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కులులోని గురుద్వారా మణికరణ్ సాహిబ్ ఎదురుగానున్న పీడబ్ల్యూడీ రోడ్డు సమీపంలో ఈ రోజు సాయంత్రం ప్రమాదం జరిగింది. మృతిచెందిన ఆరుగురు వ్యక్తుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఘటనలో మరో ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Maoists Surrender: 50 మంది మావోలు లొంగుబాటు.. 14 మంది తలపై రూ.68 లక్షల రివార్డు
పోలీసుల వివరాల ప్రకారం.. కొండ చరియలు, చెట్లు విరగి వాహనాలపై పడడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కులు సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతంలో ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి. అదే సమయంలో అటు వైపు వెళ్తున్న వెహికల్స్ పై చెట్లు విరిగిపడ్డాయి. ప్రమాదంలో కొంత మంది చనిపోగా.. మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందజేశారు. శిథిలాల కింద పలువురు స్థానికులు చిక్కుకున్నారు. క్షతగాత్రులను కాపాడేందుకు రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల గుర్తింపు వివరాలపై ఇంకా స్పష్టత లేదని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు అయితే వీరిని పర్యాటకులుగా గుర్తించినట్లు తెలిపారు.
కులులోని ADM అశ్వనీ కుమార్ కొన్ని వివరాలను వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదంపై పోలీసులు, జిల్లా పరిపాలన సహాయక బృందాలు వెంటనే స్పందించాయని అన్నారు. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జారిలోని స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మృతుల్లో రోడ్డు పక్కన ఉన్న ఒక వ్యాపారి, ఒక కారు డ్రైవర్, మరో ముగ్గురు పర్యాటకులు ఉన్నట్టు తెలుస్తోంది. జారి నుంచి అగ్నిమాపక శాఖ బృందం కూడా ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుంది. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: CM Revanth Reddy: శ్రీమంతులు తినే బియ్యం ఇక పేదలు తింటారు: సీఎం రేవంత్
ALSO READ: Jobs: బెల్ నుంచి మంచి నోటిఫికేషన్.. ఈ అర్హత ఉంటే చాలు.. దరఖాస్తుకు ఇంకా 2 రోజులే..!