BigTV English

Jobs: బెల్ నుంచి మంచి నోటిఫికేషన్.. ఈ అర్హత ఉంటే చాలు.. దరఖాస్తుకు ఇంకా 2 రోజులే..!

Jobs: బెల్ నుంచి మంచి నోటిఫికేషన్.. ఈ అర్హత ఉంటే చాలు.. దరఖాస్తుకు ఇంకా 2 రోజులే..!

BEL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. బీసీఏ, బీఈడీ, బీఎస్సీ, డిప్లొమా, బీ.ఎల్.ఐబీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.


ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) బెంగళూరు ఫ్యాకల్టీ అండ్‌ నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 1న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఓ సారి నోటిఫికేష్ పూర్తి వివరాలను చూద్దాం.

మొత్తం వెకెన్సీల సంఖ్య: 57


భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, పీఈటీ, పీఆర్ టీ, మ్యూసిక్, ఆర్ట్, డాన్స్, టీజీటీ, జీపీటీ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీసీఏ, బీఈడీ, బీఎస్సీ, డిప్లొమా, బీ.ఎల్.ఐబీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఫిల్, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 1

ఏప్రిల్ 1 లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులకు 45 ఏళ్ల వయస్సు మించరాదు. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

వేతనం: ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి నెలకు రూ.16,270 ఉంటుంది. పీఈటీ, పీఆర్‌టీ, మ్యూసిక్, ఆర్ట్, డాన్స్, టీచర్ ఉద్యోగాలకు నెలకు రూ.21,250 జీతం ఉంటుంది. టీజీటీ, జీపీటీ పోస్టులకు రూ.26,250 జీతం ఉంటుంది. పీజీ పోస్టులకు రూ.27,500 జీతం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ విధానం: ఆఫ్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

చిరునామా: దరఖాస్తును ది సెక్రటరీ-బీఈఈఐ బెల్ హైస్కూల్ బిల్డింగ్‌, జలహళ్లిపోస్ట్‌, బెంగళూరు-560013 కు చిరునామా పంపాలి.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://bel-india.in/

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 57

దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: ఏప్రిల్ 1

ALSO READ: Jobs: సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు.. రూ.32,000 జీతం.. కొన్ని గంటలే ఛాన్స్..

ALSO READ: Group-1 Results: పండుగ పూట గ్రూప్-1 అభ్యర్థులకు అదిరిపోయే న్యూస్.. జనరల్ ర్యాకింగ్స్ విడుదల

Related News

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Big Stories

×