BigTV English
Advertisement

Anurag Kashyap: ఆర్జీవి చేసిన తప్పులు నేను చేయను.. బాలీవుడ్ డైరెక్టర్ షాకింగ్ స్టేట్‌మెంట్

Anurag Kashyap: ఆర్జీవి చేసిన తప్పులు నేను చేయను.. బాలీవుడ్ డైరెక్టర్ షాకింగ్ స్టేట్‌మెంట్

Anurag Kashyap: నటీనటులు మాత్రమే కాదు.. చాలామంది దర్శకులు కూడా టాలీవుడ్ నుండే ట్రైన్ అయ్యి బాలీవుడ్‌కు వెళ్లారు. అక్కడ స్టార్ డైరెక్టర్లుగా చలామణి అవుతున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శిష్యులు కూడా ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన యాక్టర్లు, ఆయనకు సినిమాల విషయంలో సపోర్ట్ చేసిన అసిస్టెంట్లు చాలామంది ఇప్పుడు బీ టౌన్‌లోనే బిజీ అయిపోయారు. అందులో అనురాగ్ కశ్యప్ కూడా ఒకడు. దర్శకుడిగా అనురాగ్ కశ్యప్ టేకింగ్‌కు బాలీవుడ్‌లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఆయన ఆర్జీవీ శిష్యుడని చాలామందికి తెలియదు. అలాంటి డైరెక్టర్ తాజాగా తన గురువు అయిన ఆర్జీవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


జోక్యం చేసుకోను

రామ్ గోపాల్ వర్మను చూసి తాను ఫిల్మ్ మేకింగ్ గురించి చాలా తెలుసుకున్నానని వ్యాఖ్యలు చేశాడు అనురాగ్ కశ్యప్. తాను ఎప్పుడూ తనను తాను ఒక సినిమాలు తెరకెక్కించే వాడిలాగా కాకుండా ఇతరులను సినిమాలు తెరకెక్కించడానికి సాయం చేసేవాడిలాగానే చూసుకుంటానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అనురాగ్ కశ్యప్ దర్శకుడు మాత్రమే కాదు.. ఒక నిర్మాత కూడా. అనురాగ్ కశ్యప్ ఫిల్మ్స్ అనే పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి కొత్త కొత్త దర్శకులకు, నటీనటులకు అందులో అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. అయితే తను నిర్మాత స్థానాన్ని తీసుకున్నప్పుడు దర్శకుల పనిలో అస్సలు జోక్యం చేసుకోనని చెప్తున్నాడు అనురాగ్ కశ్యప్.


అలా చేసేవాడు

తాను నిర్మాతగా వ్యవహరించిన సినిమా షూటింగ్స్‌లో కూడా తాను ఎప్పుడూ పాల్గొనలేదని చెప్పుకొచ్చాడు అనురాగ్ కశ్యప్. తను దర్శకులకు అంత ఫ్రీడమ్ ఇస్తానని అన్నాడు. ‘‘ఊరికే షూటింగ్స్‌కు వెళ్లడం వల్ల ఒక డైరెక్టర్ క్రియేటివిటీలో జోక్యం చేసుకున్నట్టు అవుతుంది. ఒక దర్శకుడి విజన్ మారుతుంది, అందులో మార్పులు చేర్పులు చేయాలి అంటే ఎంత భయంగా ఉంటుందో నాకు తెలుసు. రామ్ గోపాల్ వర్మ ఇలాంటి తప్పే చేసేవారు. ఆయన ఒకేసారి చాలా ప్రాజెక్ట్స్ సైన్ చేసేవారు. దర్శకులను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించేవారు. అలా నేను చేయాలని అనుకోవడం లేదు’’ అంటూ తన గురువు చేసిన తప్పుల గురించి మాట్లాడాడు అనురాగ్ కశ్యప్.

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో చూసే తన గురించి తెలుసుకున్నాను.. రష్మికపై సల్మాన్ ఖాన్ కామెంట్స్

ఆపై మనస్పర్థలు

‘సత్య’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాను రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) డైరెక్ట్ చేశాడు. అదే సమయంలో అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) తనకు అసిస్టెంట్‌గా ఉన్నాడు. ఆ సినిమా వల్ల ఆర్జీవీకి మాత్రమే కాదు.. అనురాగ్ కశ్యప్‌కు కూడా మంచి గుర్తింపు లభించింది. కానీ ఆ సినిమా తర్వాత వీరిద్దరికి మనస్పర్థలు వచ్చి మళ్లీ కలిసి పనిచేయలేదు. కానీ ప్రస్తుతం వీరి మధ్య మనస్పర్థలు తొలగిపోయాయని తెలుస్తోంది. ‘‘ఆర్జీవీ ఎప్పటికీ నా గురువే. ఫిల్మ్ మేకింగ్‌లో ఎలాంటి తప్పులు చేయకూడదో నేను ఆయన నుండే నేర్చుకున్నాను. ఏం చేయాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. ఏం చేయకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం’’ అని చెప్పుకొచ్చాడు అనురాగ్ కశ్యప్.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×