Karimnagar Incident: జగిత్యాల జిల్లా వెల్లటూరు మండలం కిషన్ రావుపేటలో కూతురిని వేధిస్తున్నాడని యువకుడిని హత్య చేశాడో తండ్రి. తనను పెళ్లి చేసుకోవాలని యువతిని అదే గ్రామానికి చెందిన మల్లేష్ అనే యువకుడు వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇదే విషయంపై తన కూతురు వెంట పడొద్దని మల్లేష్‌ను యువతి తండ్రి పలుమార్లు హెచ్చరించాడు. అయినా మల్లేష్ వినకుండా యువతిని వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. దీంతో పద్దతి మార్చుకోవాలని మూడేళ్ల క్రితం మల్లేష్‌పై యువతి కుటుంబం దాడి చేసింది. ఇదే విషయంపై యువతి కూడా మల్లేష్‌పై ఫిర్యాదు చేయడంతో మల్లేష్‌పై నాలుగు కేసులు నమోదు అయ్యాయి.
కూతురిని వేధించాడని దారుణంగా చంపిన తండ్రి
తమ కూతురిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని తన తండ్రి, బాబాయ్, మరో వ్యక్తి కలిసి మల్లేష్‌ను హత్య చేశారు. ముఖ్యంగా వెల్లటూరు మండలం కిషన్ రావుపేటలో మల్లేష్ కొంచెం ఆవరగా తిరుగుతుండేవాడు. నేర చరిత్ర ఉన్నటువంటి ఆ వ్యక్తిని పలుమార్లు గ్రామంలో ఉన్నటువంటి వారు బెదిరించిన కూడా అతని వ్యవహారశైలి మార్చుకోలేదని తెలిపారు. అదే గ్రామంలో ప్రస్తుతం వేధిస్తున్న యువతితో పాటుగా పలు యువతులను కూడా ప్రేమ పేరుతో బెదిరించినట్లు గ్రామంలోని ప్రజలు తెలిపారు.
ఒంటరిగా ఉన్న యువతితో మల్లేష్ నానా హంగామా..
అయితే నిన్న మల్లేష్ యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటికి వెళ్ళి.. ఆ యువతికి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు అని నాన హంగామా చేశాడు. దీంతో ఇదే విషయాన్ని యువతి తండ్రికి చెప్పడంతో.. తన తండ్రి మరో ఇద్దరితో కలిసి మల్లేష్‌పై దాడి చేశారు. అతన్ని విచక్షణరహితంగా కొట్టి.. వాళ్లతోపాటు తెచ్చుకున్న కత్తులతో పొడిచి.. పొడిచి.. చంపారు.
Also Read: బనకచర్ల ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా జగన్ వ్యాఖ్యలు.. ఇంకా స్వప్నావస్థలో ఉన్నారా?
ప్రేమ, మతాలు వేరుకావడమే కారణామా..
అయితే వెల్లటూరు సమీపంలో ఉన్నటువంటి ఒక వాగు వద్ద ఈ ఘటన జరిగింది. కొన ఊపిరితో ఉన్న మల్లేష్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అక్కడి సమీపంలోని స్థానికులు 108కి సమాచారం అందించారు. అంబులెన్స్‌లో మల్లేష్‌ను ఆసుపత్రికి తరలించే సమయంలో మృతి చెందాడు. అయితే ప్రేమ, కులాలు వేరు కావడం, మరోవైపు అతని వ్యవహారశైలి కారణంగానే హత్యకు దారి తీసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో యువతి తండ్రి రాజిరెడ్డి సహా మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.