HHVM Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు. గత కొన్ని నెలలుగా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీని స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అని అటు పవన్ అభిమానులతో పాటుగా మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేలా సన్నాహాలు జరుపుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి..ఈ సినిమా విడుదల అవడానికి తక్కువ రోజులు ఉండడంతో ప్రమోషన్స్ లో స్పీడును పెంచుతారని అనుకున్నారు. కానీ మేకర్స్ ట్రైలర్, సాంగ్ అని హడావిడి చేశారు. కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
కండోమ్ ఫ్యాకెట్స్ పై “హరిహరవీరమల్లు”..
వీరమల్లు మూవీ మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉండాలి కానీ ఇంకా సైలెంట్ గా ఉండటం పై ట్రోల్స్ మొదలయ్యాయి. ఇంకా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు.. సినిమాని మళ్లీ పోస్ట్ పోన్ చేస్తారా అంటూ పవన్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాగే మరి కొంతమంది సినిమా ప్రమోషన్స్ ఇంకా కనిపించలేదు అంటూ కండోమ్స్ ప్యాకెట్స్ పై, డాగ్స్ ఫుడ్ ప్యాకెట్స్ పై వీరమల్లు పోస్టర్లను పెట్టి ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్టల్ లో ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. వీటిపై ఇప్పటికైనా చిత్ర యూనిట్స్ స్పందించి ప్రమోషన్స్ ని మొదలుపెడతారేమో చూడాలి..
Also Read : ఇవాళ ఒక్కరోజే ఓటీలోకి 16 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..
వీరమల్లు ఫ్రీరిలీజ్ ఈవెంట్..
ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 20న విశాఖ బీచ్ లో భారీ అభిమానుల సమక్షంలో వేడుక నిర్వహ ణకు సన్నాహాలు జరుతున్నాయి. తొలుత ఇదే ఈవెంట్ తిరుపతి లేదా విజయవాడలో నిర్వహించాలని అనుకున్నారు.. కానీ అనూహ్యంగా వేదిక మారింది. పవన్ కళ్యాణ్ వైజాగ్ లో చేయాలని సూచించడంతో మేకర్స్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. బాలయ్య ముఖ్య అతిధిగా ఈ వేడుక నిర్వహిద్దామని పవన్ మేకప్ కి చెప్పడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. మరి ఎవరు గెస్టుగా వస్తారో రేపు తెలిసే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని ఏ.ఎం. రత్నం నిర్మిస్తుండగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకోనుంది.. మరి రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..
Trust the process🔥🔥🔥
Never seen promotions #HHVM pic.twitter.com/PZDG9kzr0l— Kapil🥷🏻🚩 (@theyhatekapil) July 18, 2025
Mee promotions kuthan 10ga 🫨
Trust the process #HHVM https://t.co/FolhjqEj52 pic.twitter.com/3vxTOfPwac
— SᴜƦʏᴀ.. 🧧 (@Wolverine9121) July 18, 2025
Massive Pramotions raaaa @HHVMFilm 🔥🔥🔥🔥🔥🔥#HariHaraVeeraMallu pic.twitter.com/iPTdQrhVbu
— 𝘽𝙝𝙖𝙜𝙖𝙩 ✰🦅 (@Ustaad_Kalyan18) July 18, 2025