BigTV English

YS Jagan Warning: బనకచర్ల ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా జగన్ వ్యాఖ్యలు.. ఇంకా స్వప్నావస్థలో ఉన్నారా?

YS Jagan Warning: బనకచర్ల ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా జగన్ వ్యాఖ్యలు.. ఇంకా స్వప్నావస్థలో ఉన్నారా?

YS Jagan Warning: ఏపీలో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి నిండా పద్నాలుగు నెలలు పూర్తికాలేదు. అంటే ఇంకా దాదాపు నాలుగేళ్లు కూటమి సర్కారే రాష్ట్రాన్ని పాలిస్తుంది. వైసీపీ హయాంలో గాడి తప్పిన వ్యవస్థలను సెట్‌రైట్ చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం నానా పాట్లు పడుతోందన్న అభిప్రాయం ఉంది. అయితే మాజీ సీఎం జగన్ మాత్రం చంద్రబాబు అధికారంలో ఉండేది మూడేళ్లేనని జోస్యం చెప్తున్నారు. తర్వాత తానే అధికారంలోకి వస్తానని .. అప్పుడు చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగులు ఇస్తున్నారు. కేసులకు భయపడమంటూనే వైసీపీ నేతల అరెస్టులపై తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గద్దె దిగాక జగన్ ఈ తరహాలో మాట్లాడటం కొత్తేమీ కాదు. అయితే తాజాగా దూకుడు మరింత పెంచడంతో కూటమి పార్టీలతో పాటు పోలీసులకు కూడా టార్గెట్ అవ్వాల్సి వస్తోంది.


కూటమి ప్రభుత్వం ఏధి చేసినా జగన్‌కు తప్పుగానే కనిపిస్తోందా?

అయిదేళ్ల పాలనలో ఏపీలో అభివృద్ధి ఊసే ఎత్తని మాజీ ముఖ్యమంత్రి జగన్‌కి కూటమి ప్రభుత్వం ఏది చేసినా తప్పుగానే కనిపిస్తోందా? సీమ సాగు, తాగు నీటి అవసరాల కోసం కూటమి ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా జగన్ చేస్తున్న వ్యాఖ్యలతో అది నిజమేనని స్పష్టం అవుతోందంటున్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవహరించేందుకు ఇసుమంతైనా వెనకాడరని బనకచర్లపై వ్యాఖ్యలతో జగన్ మరోసారి రుజువు చేశారన్న విమర్శలు వెల్లువెత్త్తున్నాయి. తెలంగాణ వాదనను బలపర్చేలా జగన్ మాట్లాడుతున్నారని.. సీమ ప్రయోజనాలకు పోలవరం , బనకచర్ల అవసరమని ప్రభుత్వం చెపుతుంటే జగన్ మాత్రం బనకచర్ల నిర్మించడం అనవసరమని చెప్తుండటం సీమ వాసుల ఆగ్రహానికి గురవుతోంది.


జగన్ ఇంకా తానే సీఎం అన్న భ్రమల్లో ఉన్నారని సెటైర్లు

వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం సలహాదారుల టీమ్‌ను నియమించుకుని పాలించిన జగన్‌కు రాష్ట్ర పరిస్థితులపై సంపూర్ణ అవగాహన లేదని, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లని వాదించే ఆయన రాజకీయ పరిపక్వత సాధించలేదన్న అభిప్రాయం ఉంది. దానితోడు గద్దె దిగాక జగన్ ఇంకా తానే సీఎం అని భ్రమల్లో ఉన్నారని, రాష్ట్రానికి తానే శాశ్వత సీఎం అని ఫీలవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడా నిండా పద్నాలుగు నెలలు గడవకుండానే జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేది తానే అని ధీమా వ్యక్తం చేస్తూ, సీఎం చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న అధికారులకు వార్నింగులు ఇస్తుండటం తీవ్ర విమర్శల పాలవుతోంది.

తాము వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగులు

అదేమంటే మీరు అధికారంలో మహా అయితే మూడేళ్లు ఉంటారని.. ఆ తర్వాత వచ్చేది తామేనని.. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునే హెచ్చరిస్తున్నారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదని.. మనం ఏపీలో ఉన్నామా.. బీహార్ లో ఉన్నామా.. అంతుపట్టడం లేదని జగన్ అంటుండటంపై నెటిజన్లు, కూటమి నేతలు సెటైర్లు విసురుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రాబాబు, ఇతర టీడీపీ ముఖ్యలపై కేసులు పెట్టి అరెస్టులు చేయించిన జగన్ ఇప్పుడు బీహార్ పాలన గురించి మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందని వ్యంగస్త్రాలు విసురుతున్నారు.

ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మచ్చలేని అధికారులంట

నెల్లూరు జిల్లాలో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. నల్లపురెడ్డి ఇంటిపై దాడిని జగన్ తీవ్రంగా ఖండిస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి, వల్లభనేని వంశీ, నందిగాం సురేష్, పోసాని కృష్ణ మురళి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. తమ జీవితంలో మచ్చలేని అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహనరెడ్డిలపై తప్పుడు వాంగ్మూలాల్తో కేసులు పెట్టించారని వాపోతున్నారు. ఆ క్రమంలో సినీ డైలాగులతో తన దైన స్టైల్లో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు

జగన్ స్వప్నావస్థలోనే ఉన్నారని మాధవ్ మండిపాటు

అధికారంపై కలలు కంటూ ప్రభుత్వానికి, అధికారులకు తెగ వార్నింగులు ఇస్తున్న మాజీ సీఎం జగన్ కూటమి నేతలకు ఒక రేంజ్లో టార్గెట్ అవుతున్నారు. జగన్ ను ప్రజలు చిత్తుగా ఓడించినా ఇంకా మేల్కోలేదని… స్వప్నావస్ధలోనే జగన్ ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఫైర్ అయ్యారు. జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే రాష్ట్రానికి ఇంకా పర్మినెంట్ తానే అనుకుంటున్నారని యద్దేవా చేశారు. పోలీస్ వ్యవస్థ ను గతంలో నిర్వీర్యం చేసింది జగనేనని, ఐఏఏస్ లు ఐపిఎస్ లను ముంబై పంపి ఎన్నో అరాచకాలు చేశారని విమర్శలు గుప్పించారు.

రప్పా..రప్పా అంటే తప్పులేదన్న జగన్‌పై ఆనంద్ బాబు ధ్వజం

మరోవైపు టీడీపీ నేతలు జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతికత జగన్‌కు లేదని, మీ హయంలో పోలీస్ వ్యవస్థను ఎలా వాడుకున్నారో ప్రజలకు తెలియదా? అని టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లు గట్టినప్పుడు ఏమైంది నీ ప్రజాస్వామ్యం, నీ హయాంలో ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్లిని రోడ్డుపైకి రానిచ్చావా?.. ఇప్పుడు రప్పా..రప్పా అంటే తప్పు లేదని మాట్లాడుతున్నావని జగన్‌పై ధ్వజమెత్తారు.

సొంత చెల్లిపై తప్పుడు ప్రచారం చేశారని జగన్‌ని టార్గెట్ చేసిన అనిత

జగన్‌రెడ్డి మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదని హోం మంత్రి అనిత ఫైర్ అయ్యారు. కోవూరులో 50 వేల మెజారిటీతో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గెలిచారని, ఓడిపోయిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ఆమె చెల్లి వరుస అవుతారని, ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను న్యాయస్థానాలు కూడా తప్పు పెట్టాయని, జగన్ మాత్రం సమర్ధిస్తున్నారని మండిపడ్డారు. రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లి గురించే తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదని విమర్శించారు. రౌడీషీటర్లను పరామర్శిస్తూ, బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పోగట్టుకుని ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలను ఓదార్చే జగన్‌కు ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని ధ్వజమెత్తారు.

పోలీసు అధికారుల సంఘం ప్రతినిధుల ఫైర్

పోలీసులను ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు ఫైర్ అయ్యారు. జగన్ వ్యాఖ్యలను ఏపీ పోలీసు అధికారులు సంఘం అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ప్రతీ అంశంలో పోలీసులపై విమర్శలు చేయడం పరిపాటిగా మారిందన్నారు.తనకు రక్షణ కల్పించకుండా కుట్రలు చేస్తున్నారని సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడటం సబబు కాదని విమర్శించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని తెలుసుకోవాలని ఆయన హితవుపలికారు. పోలీసులను వీఆర్‌లో పెట్టడం అనేది గత ప్రభుత్వంలో చేశారని మండిపడ్డారు. ఆరోపణలు వచ్చిన అధికారులపై చర్యలు సహజమని చెప్పుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంత మంది పోలీసులను పక్కన పెట్టారో గుర్తు చేసుకోవాలన్నారు.డీఐజీ స్థాయి అధికారిని డాన్ అని చెప్పడం సరికాదన్నారు. పోలీసు వ్యవస్థను నడిపే డీజీపీని టార్గెట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.

Also Read: ఏకమవుతున్న రష్యా, ఇండియా, చైనా.. అమెరికాకు టెన్షన్..

మొత్తానికి జగన్ అధికారంలోకి వస్తామని కలవరిస్తున్నట్లు మాట్లాడుతుండటంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటం అంటున్న జగన్ రూపొందించుకుంటున్న టూర్ షెడ్యూల్‌లు ఎప్పటికప్పుడు ఉద్రిక్తతలకు దారి తీస్తున్న నేపధ్యంలో.. ఇక ఆయన మరోసారి సీఎం అయితే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో అని నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

Story By Rami Reddy, Bigtv

Related News

GST 2.0: ప్రజల డబ్బు బయటకు తెచ్చేందుకు.. జీఎస్టీ 2.0తో మోదీ భారీ ప్లాన్

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

Congress: గుత్తా లేఖల వెనక సీక్రెట్ ఏంటి?

AP Politics: టీడీపీలో సంస్థాగత మార్పులపై రచ్చ!

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొత్తం స్క్రిప్టా… మరీ ఇంత మోసమా?

AP Politics: జనసేన మీటింగ్ సక్సెస్ అయ్యిందా?

Big Stories

×