Donald Trump Health: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఏమైంది? ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేదా? ఆయన కాళ్లు ఎందుకు వాపు వస్తున్నాయి? అతని చేతిపై ఉన్న చర్మం ఎందుకు రంగు మారుతుంది? ప్రస్తుతం ఈ ప్రశ్నలు అమెరికాలోనే కాదు.. వరల్డ్ వైడ్‌గా చర్చనీయాంశంగా మారింది. ఏ విషయంపై క్లారిటీ లేకపోవడంతో.. అనేక పుకార్లు చక్కర్లు కొట్టాయి. ట్రంప్ ఆరోగ్యం తీవ్రంగా విషమించిందని.. అతను తీవ్రమైన ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారని ఇలా రకారకాల వదంతులు చక్కర్లు కొట్టాయి. అయితే వీటన్నింటికి చెక్ పెట్టింది వైట్‌హౌజ్.
ట్రంప్ కాళ్లకు వాపు ఎందుకు వచ్చింది?
వైట్‌హౌస్ ప్రకటన ప్రకారం.. ట్రంప్ కాళ్ల దిగువ భాగంలో, చీలమండ వద్ద వాపు వచ్చిందని.. దీన్ని సాధారణ సిరల లోపంగా నిర్ధారించారు. ఇది వృద్ధులలో, ముఖ్యంగా 70 ఏళ్లు దాటిన వారిలో తరచూ కనిపించే సమస్య.
సాధారణంగా ఇది ఏ విధంగా ప్రమాదకరమైన “ఆర్టీరియల్ డిసీజ్” కాదు. శరీరంలో లోతైన శిరల్లో రక్తం గడ్డకట్టడం వల్ల.. ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఈ వ్యాధిని మంధులతో నియంత్రించవచ్చు. ట్రంప్‌కు దీని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.
చేతిపై గాయం..? చర్మం రంగు మారడం
ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ట్రంప్ చేతిపై కనిపించిన గాయంలాంటి మచ్చ. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ కావడంతో.. ఆ గాయం వెనక ఉన్న కారణాలపై అనేక వదంతులు వ్యాపించాయి. కొంతమంది ఇది రక్తపోటు సమస్యలతో సంభవించిందని, మరికొంతమంది గుండె సంబంధిత చికిత్సలతో.. సంబంధం ఉందని ఊహించుకున్నారు.
అయితే వైట్‌హౌస్ చెప్పినదాని ప్రకారం, ట్రంప్ వాడుతున్న కొన్ని ఔషధాల వలన, ముఖ్యంగా రక్తాన్ని పలుచగా చేయడంలో.. ఉపయోగించే ఆస్పిరిన్ వలన వచ్చిన సైడ్ ఎఫెక్ట్ అని తెలిపారు. అయితే ఈ విషయం మీద ఎక్కువ వివరాలను వెల్లడించలేదు.
వదంతులకు చెక్ పెట్టిన వైట్‌హౌస్
ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న అనేక పుకార్లను ఖండిస్తూ, వైట్‌హౌస్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో ట్రంప్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన ఆరోగ్యంపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రజల్లో నెలకొన్న అనుమానాలను తొలగించేందుకు.. ఈ వివరాలను వెల్లడిస్తున్నామని స్పష్టంచేశారు.
రాజకీయ ప్రాధాన్యత & సమయం
ఇది సాధారణంగా ఒక ఆరోగ్య సమస్యే అయినప్పటికీ, ట్రంప్ ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ తరఫున.. మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండటంతో, ఆయన ఆరోగ్యం రాజకీయంగా చాలా కీలకమైన అంశంగా మారింది.
Also Read: ఆఫీసుకు వెళ్లేందుకు 1600 కిమీల విమాన ప్రయాణం.. చివరికి పరిష్కారం దొరికింది
ఇలాంటి ఆరోగ్య అంశాలు ప్రజలలో విశ్వాసం, భద్రత భావం పై ప్రభావం చూపవచ్చు. అందుకే వైట్‌హౌస్ ప్రస్తుత సమయంలో.. త్వరిత స్పందనతో అధికారికంగా స్పందించింది.