BigTV English

Hyderabad Crime News: హైదరాబాద్‌లో కొత్త రకం డ్రగ్స్‌.. టార్గెట్ టెక్కీలే, గంజాయి కంటే ప్రమాదకరం

Hyderabad Crime News: హైదరాబాద్‌లో కొత్త రకం డ్రగ్స్‌.. టార్గెట్ టెక్కీలే, గంజాయి కంటే ప్రమాదకరం

Hyderabad Crime News: భాగ్యనగరాన్ని డ్రగ్స్ మహామ్మారి ఏమాత్రం వదల్లేదు. ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు చేపట్టినప్పటికీ  ఏ మాత్రం తగ్గలేదు. ప్రజలను చైతన్యం పరిచేందుకు సెలబ్రిటీల ద్వారా ప్రచారం చేస్తోంది. అయినా చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా అత్యంత ప్రమాదకరమైన ఓజీ కుష్ డ్రగ్స్ పట్టుబడటం పోలీసులకు అంతుబట్టడం లేదు.


ఓజీ ఖుష్‌ డ్రగ్స్

హైదరాబాద్ సిటీలో అత్యంత ప్రమాదకరమైన ఓజీ ఖుష్‌ డ్రగ్స్‌ హంగమా చేస్తోంది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా, ఆఫ్రికా దేశాలకు ఎక్కువగా అక్రమ రవాణా అయ్యేది. ఇప్పుడు భాగ్యనగరంలో ఆ తరహా డ్రగ్స్ విస్తరిస్తోంది. ఓజీ ఖుష్‌ అనేది గంజాయిలో అదొక రకం. అత్యంత ప్రమాదకరమైంది కూడా.


అఫ్గనిస్థాన్‌లోని హిందూ ఖుష్‌ కొండల్లో ఈ డ్రగ్స్‌ను సాగు చేస్తారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. దీనిపై ఆంక్షలు విధించడంతో అక్కడ తగ్గుముఖం పట్టిందని నివేదికలు చెబుతున్నాయి. హిమాలయ పర్వతాల్లో ఆ తరహా డ్రగ్స్ పండించేందుకు అనుకూల వాతావరణం ఉండడమే ఇందుకు కారణం. ఈ డ్రగ్ నీళ్లలో ఎక్కువగా పండుతుంది. ప్రస్తుతం అమెరికాలోని ఫ్లోరిడా, కాలిఫోర్నియా వంటి ప్రాంతాల్లో పండిస్తారు.

గంజాయిలో అదొక రకం 

ఓజి కుష్ అనేది గంజాయి కంటే 25 శాతం ఎక్కువ మత్తు ఇస్తుంది. దీన్ని విదేశాల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. గంజాయి మాదిరిగా పండించడానికి భూమి అవసరం లేదు.  తాజాగా హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దర్ని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఓజీ ఖుష్‌ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఆ డ్రగ్స్ విలువ మార్కెట్లో దాదాపు 40 లక్షలు రూపాయలు ఉంటుందని చెబుతున్నారు.

ALSO READ: ఏపీలో అతి పెద్ద పోర్న్ స్కామ్

అలాగే విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లి ఎక్సైజ్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయా విషయాలను అధికారులు వెల్లడించారు.  కాచిగూడ రైల్వే స్టేష్టన్‌ వద్ద బైక్‌పై ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడని వివరించారు. స్కోడా కారులో ఓజీ కుష్‌ డ్రగ్స్‌ను మార్పిడి చేసుకునే సమయంలో ఎక్సైజ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

బుక్కయిన టెక్కీ

కారు తనిఖీలు చేయగా 500 గ్రాముల ఓజీ కుష్‌ డ్రగ్స్ ఉంది. అలాగే కేజీ గంజాయి, 6 గ్రాముల చరస్‌, 4.38 గ్రాముల సింథటిక్‌ డ్రగ్స్‌తో పాటు 5 విదేశీ మద్యం బాటిళ్లు ఉన్నాయి. ఇద్దరు నిందితులు ప్రతీష్ బట్, జైసూర్యలను అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు సాప్ట్ వేర్ ఇంజనీర్ కాగా, మరొకరు రియల్ ఎస్టేట్ సంస్థలో సూపర్ వైజర్‌‌గా పని చేస్తున్నాడు.

నగరంలో ఒక గ్రాము ఓజీ కుష్ డ్రగ్‌ను రూ. 3వేలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. బుధవారం మధ్యాహ్నం జయసూర్యకు ప్రతీక్ డ్రగ్స్ అమ్ముతుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు. డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్టు పక్కాగా సమాచారం మేరకు అక్కడ నిఘా వేసి వారిని అరెస్టు చేసినట్టు చెప్పుకొచ్చారు. అరెస్టు చేసిన నిందితులు కర్ణాటక నుండి ఆ డ్రగ్స్‌ని తీసుకొచ్చినట్టు తేలిందన్నారు.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×