Gundeninda GudiGantalu Today episode April 17 th : నిన్నటి ఎపిసోడ్ లో.. మాణిక్యం వెళ్లగానే అందరు వెళ్లిపోవాలని అనుకుంటారు. పల్లెటూళ్లో బోర్ కొడుతుందని వెళ్లిపోదామని రవితో అంటుంది శృతి. మరోవైపు రోహిణి కూడా పళ్లెటూళ్లో ఉండటం నచ్చలేదంటూ యాక్టింగ్ చేస్తుంది. ఉన్న రెండు రోజులు ఆనందంగా గడిపేందుకు వారి కోసం కొన్ని ఆటల పోటీలు పెడుతుంది సుశీల. ఈ పోటీలో ఎలాగైనా బాలు, మీనాలను ఓడించాలని ప్రభావతి స్కెచ్ వేస్తుంది. బాలు తమను మాటలతో టార్చర్ పెడుతున్న సంగతి గుర్తు చేసుకుంటారు రవి – శృతితో పాటు మనోజ్ – రోహిణి. బాలుపై రివేంజ్ తీర్చుకోవడానికైనా అతడిని ఓడించాలని ఫిక్సవుతారు.. అందరిని పోనివ్వకుండా సుశీల ప్లాన్ చేస్తుంది. కుటుంబ సభ్యులను రెండ్ టీమ్‌లుగా విడగొడుతుంది సుశీల. ఓ టీమ్‌కు కెప్టెన్‌గా ప్రభావతి.. మరో టీమ్‌కు కెప్టెన్‌గా సత్యం ఉంటారు. సత్యం టీమ్‌లో మీనా, శృతి, రోహిణి ఉండగా. ప్రభావతి టీమ్‌లో రవి, బాలు, మనోజ్‌లు ఉంటారు. మొత్తానికి ప్రభావతి టీమ్ విన్నర్ గా నిలుస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు తన తల్లి గురించి తన మనసులోని బాధను బయటపెడతాడు. తల్లి కోసం తన ఎంత ఆరాటపడుతున్నాడో అందరికీ తెలిసేలా చేస్తాడు. తన మనసులో ఇంత బాధ ఉందని ప్రభావతికి అప్పుడే తెలుస్తుంది. ఇంట్లోని వాళ్ళందరూ తన మనసులోని బాధ విని బాధపడతారు. బాలు మనసులో ఇంత బాధ తాగి ఉందని శృతిరవిలు మాట్లాడుకుంటారు. అటు రోహిణి కూడా బాలుమనసులు ఇంత బాధను పెట్టుకున్నాడని బాధపడుతుంది. చెయ్యను తప్పుకు నేరం నేను అనుభవించానని చెప్పబోతూ ఉంటే సత్యం బాలుని ఆపుతాడు.
బాలు మనస్సుల్లో ఇంత బాధ ఉందా అని శృతి కూడా బాధపడుతుంది. బాలు రాత్రి పడుకునేందుకు ముందు ఆరుబయట మంచంపై దిగాలుగా కూర్చుకుంటాడు. తన గతాన్ని గుర్తుచేసుకుంటూ బాధపడుతాడు. దాంతో మీనా వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. నాకు కూడా చెప్పలేనిదా అని అంటుంది. దాని బాలు అమ్మతో మాత్రమే చెప్పేది, అమ్మకు మాత్రం అది అర్థం అవుతందని అంటాడు.. కానీ నా బాధ మా అమ్మకి ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదని బాధపడతాడు.. మీరేం బాధపడకండి మీ మనసులోని బాధ ఏదో ఒక రోజు మీ అమ్మగారికి చేరుతుంది ఆమె మిమ్మల్ని నా కొడుకుని దగ్గరకు తీసుకుంటుందని చెప్తుంది.
తర్వాత రోజు ఉదయం అందరు సిటీకి వెళ్లిపోతారు.. ఇక మీనా ఏం జరిగిందని తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ బాలు చెప్పేందుకు ఇష్టపడడు. ఇక ఆ తర్వాత ఎపిసోడ్ లో బాలు రోహిణి గుట్టు తెలుసుకుంటాడు. రైడ్ కోసం వెళ్లి రోహిణి పార్లర్ వద్దకు వెళ్తాడు. కస్టమర్ డబ్బులు ఇవ్వకపోవడంతో అడిగేందుకు పార్లర్ లోపలికి వెళ్తాడు. ఈ పార్లర్ ఓనర్ రోహిణి లేదా అని అడుగుతాడు. అందుకు అక్కడ పనిచేసే బ్యూటీషియన్ ఈ పార్లర్ రోహిణిది కాదని, ఆమె ఇందులో బ్యూటీషియన్ గా మాత్రమే పనిచేస్తుందని బదులిస్తుంది. అది విన్న బాలు షాక్ అవుతాడు..
అయితే ఈ పాలరమ్మ కూడా ఇంట్లో అబద్దాలు చెప్తుందా ఎందుకు పార్లర్ ని అమ్మేసింది తనకి డబ్బులు కావాలంటే వాళ్ళ నాన్న అడిగి తీసుకోవచ్చు కదా ఏదో జరిగింది అసలు ఈ మలేషియా నిజమేనా అని బాలు ఆలోచిస్తాడు. అయినా సరే పాలనమ్మ గురించి నిజాన్ని బయట పెట్టాలని అనుకుంటాడు. ఇక రోహిణి అడ్డంగా దొరికిపోయాను ఏదో ఒకటి మేనేజ్ చేయాలి లేదంటే నా నాటకం బయటపడుతుందని టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. కానీ మీనా మాత్రం బాలు మనసులో బాధని బయటకు పెట్టాలని తన తల్లిని బిడ్డని ఒకటి చేయాలని చూస్తుంది. ప్రభావతికి బాలుపై ప్రేమ పుట్టేలా చేస్తుంది. రోహిణి బాలు చేసిన పనికి తన మోసం ఎక్కడ బయటపడుతుందని టెన్షన్ పడుతుంది.. మొత్తానికి బాలు పాలరమ్మ గురించి నిజాన్ని ఇంట్లో చెప్తాడో లేదో చూడాలి.. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..