Road accident: సూర్యాపేట జిల్లాలో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని చింతపాలెం మండలంలోని కట్ట మైసమ్మ గుడి వద్ద ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి అదుపుతప్పి కాలువలో బోల్తా పడడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల ప్రకారం.. కోదాడ నుంచి నక్కగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఎదురుగా ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయే క్రమంలో బస్సు అదుపు తప్పి కాలువలో బోల్తాపడింది. ప్రమాదం జరగబోయే క్రమంలో.. డ్రైవర్ బైక్ ను తప్పంచే క్రమంలో బస్సు నియంత్రించేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలోనే స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో బస్సు అదుపు తప్పి కాలువలో పడింది.
Also Read: CSIR-CRRI Recruitment: గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.81,100 జీతం..
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 65 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 25 మందికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం. మరో పదిమందికి తీవ్రగాయాల అయినట్టు తెలుస్తోంది. స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. స్థానిక యువత సాయంతో క్షతగాత్రులను మేళ్ల చెరువు, హుజుర్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే చింతలపాలెం యువత మానవత్వం చాటుతూ ముందుకొచ్చారు. సహాయక చర్యల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో సహకరించారు. స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: CM Chandrababu Birthday: సీఎం చంద్రబాబు బర్త్ డే వేడుకల్లో అపశృతి.. గుండెపోటుతో టీడీపీ నేత మృతి