CM Chandrababu Birthday: రెండు తెలుగు రాష్ట్రాల్లో సీఎం చంద్రబాబు నాయుడు బర్త్ డే వేడుకలు టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుతున్నాయి. సీఎం జన్మదిన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లాలోని ఆలూరులో సీఎం చంద్రబాబు నాయుడు బర్త్ డే సందర్భంగా ఇవాళ టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ ర్యాలీలో టీడీపీ జిల్లా యూత్ అధికార ప్రతినిధి బోయ సురేంద్ర నాయుడు(31) పాల్గొన్నారు. అయితే ఆయనకు ఉన్నట్టుండి ఒక్కసారిగా తీవ్ర గుండెపోటు రావడంతో.. కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే గమనించిన టీడీపీ కార్యకర్తలు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బోయ సురేంద్ర మృతిచెందారని డాక్టర్లు తెలిపారు.
Also Read: CSIR-CRRI Recruitment: గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.81,100 జీతం..
దీంతో స్థానిక టీడీపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. టీడీపీ పార్టీ కార్యక్రమంలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే బోయ సురేంద్ర నాయుడు మృతిచెందడంతో పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు తీవ్రం విషాదంలో మునిగిపోయారు. సీఎం చంద్రబాబు నాయుడు బర్త్ డే వేడుకల్లో చనిపోవడంతో నెల్లూరు జిల్లాలోని టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి.
పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే నాయకుడు, కేడర్ లో ఎలాంటి కష్టం వచ్చినా.. ముందుకు వచ్చే బోయ సురేంద్ర నాయుడు లాంటి నేత మృతిచెందడం పట్ల పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సురేంద్ర మృతిచెందిన విషయం తెలుసుకున్న జిల్లా పార్టీ నేతలు చాలా మంది ఆలూరుకు బయల్దేరారు. బోయ సురేంద్ర నాయుడు మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.
Also Read: CM Revanth Reddy: జపనీస్ స్టైల్‌లో సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం.. ఇదిగో వీడియో..