BigTV English
Advertisement

Shruti Haasan: ‘సలార్’ నా సినిమా కాదు.. ప్రభాస్ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసిన శృతి హాసన్

Shruti Haasan: ‘సలార్’ నా సినిమా కాదు.. ప్రభాస్ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసిన శృతి హాసన్

Shruti Haasan: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఉండే క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రేక్షకులకు తెలుసు. ప్రేక్షకుల దృష్టిలో మాత్రమే కాదు.. సినీ సెలబ్రిటీల దృష్టిలో కూడా ప్రభాస్ అంటే ఒక మంచి మనసున్న స్టార్‌గానే గుర్తింపు ఉంది. ముఖ్యంగా తనతో పాటు నటించే నటీనటులకు భోజనం అందించే విషయంలో తన మనసు చాలా పెద్దది అని అంటుంటారు. అలా ప్రభాస్‌తో నటించే హీరోయిన్స్ అంతా తన మంచితనానికి ఫిదా అవుతుంటారు. తాజాగా శృతి హాసన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే తను కూడా ప్రభాస్‌కు ఫ్యాన్ అయిపోయిందేమో అనిపిస్తుంది. అలా తనతో కలిసి నటించిన ‘సలార్’ మూవీపై శృతి చేసిన కామెంట్స్ ప్రభాస్ ఫ్యాన్స్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.


ఇబ్బందికరమైన ప్రశ్న

ప్రశాంత్ నీల్, ప్రభాస్ (Prabhas) కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమానే ‘సలార్’ (Salaar). ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. దీనిని ఒక పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాగా తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. అందుకే హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదు. కానీ ఈ మూవీలో హీరోయిన్‌గా శృతి యాక్టింగ్‌కు కూడా మంచి మార్కులు పడ్డాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్‌కు ‘సలార్’కు సంబంధించి ప్రశ్న ఎదురయ్యింది. ‘సలార్’లో తన పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు అన్నట్టుగా వ్యంగ్యంగా ఇంటర్వ్యూ చేసింది ఒక అమ్మాయి. ఆ ప్రశ్న చాలా ఇబ్బందికరంగా ఉన్న కూడా దానిని శృతి హాసన్ హ్యాండిల్ చేసిన తీరు ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది.


చాలా కష్టపడ్డారు

‘‘తన కెరీర్‌ కోసం ప్రభాస్ చాలా కష్టపడ్డాడు. అలాగే ప్రశాంత్ నీల్ కూడా తన కెరీర్ కోసం కష్టపడ్డాడు. వాళ్లిద్దరూ సలార్‌కు పిల్లర్స్ లాంటివాళ్లు. నేను సలార్‌లో ఒక భాగం మాత్రమే కానీ సలార్ నా గురించి కాదు. అది ప్రభాస్ సినిమా అని చెప్పుకోవడంలో నాకేం ప్రాబ్లమ్ లేదు’’ అని తెలిపింది శృతి హాసన్. ఆ సమాధానానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మామూలుగా వేరే హీరోయిన్స్ అయితే తన పాత్రకు ప్రాముఖ్యత లేదు అంటే అది కమర్షియల్ సినిమా అని, తన పాత్ర అంతే ఉందని తెలిసినా ఒప్పుకున్నామని.. ఇలా ఏవేవో సమాధానాలు చెప్తుంటారు. కానీ శృతి హాసన్ మాత్రం ‘సలార్’ క్రెడిట్‌ను పూర్తిగా ప్రభాస్‌కే ఇవ్వడం తనపై గౌరవాన్ని పెంచేసింది.

Also Read: ప్రభాస్ పెళ్లి అయిపోయిందోచ్.. సెలబ్రిటీలంతా కలిసి దగ్గరుండి మరీ చేశారుగా.?

అన్నింటిని బ్యాలెన్స్

కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శృతి హాసన్ (Shruti Haasan). హీరోయిన్‌గా తన కెరీర్ ప్రారంభించినప్పటి నుండి అటు కమర్షియల్ సినిమాలు, ఇటు డిఫరెంట్ పాత్రలు.. అన్నీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తోంది. అలాగే ఎంతోమంది స్టార్ హీరోలతో కూడా నటించింది. కెరీర్ మొదట్లో తనకు ఒక్క హిట్ కూడా లేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్’తో తెలుగులో మొదటి హిట్ సాధించింది. ఆ తర్వాత తనకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్, స్టార్ హీరోలతో సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం తను హీరోయిన్‌గా సినిమాలతో పాటు తన మ్యూజిక్ కెరీర్‌పై కూడా దృష్టి పెట్టింది శృతి హాసన్.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×